Producer Mukesh Bhatt Reacts On Mahesh Babu Controversial Comments - Sakshi
Sakshi News home page

Mukesh Bhatt : 'అది వ్యక్తిగత అభిప్రాయం.. మహేశ్‌ బాబు తప్పు లేదు'

Published Thu, May 12 2022 1:33 PM | Last Updated on Thu, May 12 2022 2:43 PM

Producer Mukesh Bhatt Reacts On Mahesh Babu Controversial Comments - Sakshi

Mukesh Bhatt on Mahesh Babu: బాలీవుడ్‌పై సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు చేసిన కామెంట్స్‌ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇటీవలె ఓ ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన ఆయన తనను భరించడం బాలీవుడ్‌కు కష్టమని, అందుకే, తన సమయాన్ని వృథా చేసుకోవాలని అనుకోవట్లేదని పేర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా మహేశ్‌ చేసిన ఈ వ్యాఖ్యలపై బాలీవుడ్‌ ప్రముఖ సీనియర్‌ నటుడు, నిర్మాత ముకేశ్‌ భట్‌ స్పందించారు.

ఆయన మాట్లాడుతూ.. 'ఆయనకు కావాల్సిన సౌకర్యం బాలీవుడ్‌ ఇవ్వలేకపోవచ్చు అని అనుకోవడంలో తప్పులేదు. మహేశ్‌ ఎంతో ప్రతిభావంతుడు. ఆయన ప్రయాణాన్ని నేను గౌరవిస్తాను. అయన ఆల్రెడీ సక్సెస్‌ఫుల్‌ హీరో. మహేశ్‌ అంచనాలని బాలీవుడ్ అందుకోలేకపోవచ్చు అనడం ఆయన వ్యక్తిగత అభిప్రాయం. అయితే అందులో ఎటువంటి తప్పు లేదు' అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కామెంట్స్‌ నెట్టింట వైరల్‌గా మారాయి. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement