ఆ రెండు సినిమాలకు భారీ కలెక్షన్లు | Ae Dil Hai Mushkil, Shivaay' mint over Rs 10 crore each on opening day | Sakshi
Sakshi News home page

ఆ రెండు సినిమాలకు భారీ కలెక్షన్లు

Published Sat, Oct 29 2016 6:43 PM | Last Updated on Mon, Sep 4 2017 6:41 PM

ఆ రెండు సినిమాలకు భారీ కలెక్షన్లు

ఆ రెండు సినిమాలకు భారీ కలెక్షన్లు

ముంబై: కరణ్‌ జోహార్ సినిమా ఏ దిల్ హై ముష్కిల్, అజయ్ దేవగణ్ చిత్రం శివాయ్ బాక్సాఫీసు వద్ద పోటీపడుతున్నాయి. దీపావళి కానుకగా శుక్రవారం విడుదలైన ఈ రెండు సినిమాలు భారీగా ఓపెనింగ్ కలెక్షన్లు సాధించాయి.

3 వేల స్క్రీన్లపై విడుదలైన ఏ దిల్ హై ముష్కిల్ తొలి రోజు దేశంలో 13.30 కోట్ల రూపాయలు (నెట్) వసూలు చేసింది. ఈ సినిమాలో రణవీర్ కపూర్, ఐశ్వర్యా రాయ్ నటించారు. కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన సినిమాల్లో ఇదే బిగ్గెస్ట్ ఓపెనర్గా నిలిచింది. ఇక స్వీయ దర్శకత్వంలో అజయ్ దేవగణ్ నటించిన శివాయ్ తొలిరోజు 10.24 కోట్లు వసూలు చేసింది. శనివారం, ఆదివారం సెలవు రోజులు కావడంతో భారీ కలెక్షన్లు రావచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాగా పాకిస్థాన్ నటుడు ఫవాద్ ఖాన్ నటించిన ఏ దిల్ హై ముష్కిల్ సినిమా ప్రదర్శనకు వ్యతిరేకంగా కొన్ని చోట్ల నిరసనలు వ్యక్తమయ్యాయి. మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో ఈ సినిమాను ప్రదర్శిస్తున్న థియేటర్ల ముందు ఆందోళన చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement