రెండో రోజూ భారీ కలెక్షన్లు | Day 2 Box Office collection of Karan Johar's Ae Dil Hai Mushkil | Sakshi
Sakshi News home page

రెండో రోజూ భారీ కలెక్షన్లు

Published Sun, Oct 30 2016 4:27 PM | Last Updated on Mon, Sep 4 2017 6:46 PM

రెండో రోజూ భారీ కలెక్షన్లు

రెండో రోజూ భారీ కలెక్షన్లు

న్యూఢిల్లీ:  కరణ్‌ జోహార్ సినిమా ఏ దిల్ హై ముష్కిల్ రెండో రోజూ భారీ కలెక్షన్లు సాధించింది. ఈ సినిమాకు శనివారం 13.10 కోట్ల రూపాయలు (నెట్‌​) వచ్చాయి. తొలి రెండు రోజుల్లో ఈ సినిమా దేశవ్యాప్తంగా మొత్తం 26.40 కోట్ల రూపాయలు (నెట్‌) వసూలు చేసింది.

దీపావళి కానుకగా శుక్రవారం 3 వేల స్క్రీన్లపై విడుదలైన ఏ దిల్ హై ముష్కిల్ తొలి రోజు దేశంలో 13.30 కోట్ల రూపాయలు (నెట్) వసూలు చేసింది. ఈ సినిమాలో రణబీర్‌ కపూర్‌, ఐశ్వర్యా రాయ్ నటించారు. కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన సినిమాల్లో ఇదే బిగ్గెస్ట్ ఓపెనర్గా నిలిచింది. కాగా పాకిస్థాన్ నటుడు ఫవాద్ ఖాన్ నటించిన ఈ సినిమా ప్రదర్శనకు వ్యతిరేకంగా కొన్ని చోట్ల నిరసనలు వ్యక్తమయ్యాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement