
బెదిరింపులు వద్దనుకున్నా: హీరో
ముంబై: హిందీ సినిమా 'ఏ దిల్ హై ముష్కిల్' వివాదంపై తన అభిప్రాయాలను వెల్లడించలేనని బాలీవుడ్ హీరో, ఆమిర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. తన అభిప్రాయాలను వెల్లడించి ప్రమాదాలు కొనితెచ్చుకోలేనని అన్నారు.
'ఈ వివాదంపై నాకు చాలా అభిప్రాయాలు ఉన్నాయి. నేను గనక నా అభిప్రాయాలు వెల్లడిస్తే కొంతమంది మా ఇంటిని తగలబెట్టేందుకు ప్రయత్నిస్తారని నాకు భయం. దాడులు చేస్తామన్న హెచ్చరికలు ఎదుర్కోవడం నాకు ఇష్టం లేదు. అందుకే నా అభిప్రాయాలను నాలోనే దాచుకుంటున్నాన'ని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నాడు.
కాగా, పాకిస్థాన్ నటుల సినిమాలను ప్రదర్శించబోమని ధియేటర్ల యజమానుల సంఘం చేసిన ప్రకటనపై స్పందించేందుకు ఆమిర్ ఖాన్ నిరాకరించాడు. దీని గురించి ధియేటర్ల యజమానుల సంఘాన్నే అడగాలని అన్నాడు.