
థ్రిల్లింగ్ ఫస్ట్‌లుక్: 'శివాయ్' సాహసాలు!
అజయ్ దేవగణ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక సినిమా 'శివాయ్'. దీపావళి పండుగకు విడుదల కాబోతున్న ఈ సినిమాపై చాలా అంచనాలే ఉన్నాయి. అజయ్ దేవగణ్‌తోపాటు సైరాబాను, దిలీప్‌కుమార్, సాయెషా సైగల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ పోస్టర్‌ను తాజాగా ట్విట్టర్‌లో విడుదల చేశారు.
పరమశివుడిని తలపించే మంచుకొండల్లో హెలికాప్టర్ నుంచి తాడు పట్టుకొని సాహసాలు చేస్తున్న అజయ్ లుక్‌తో ఈ పోస్టర్ అదరగొడుతున్నది. అజయ్ అభిమానుల్ని థ్రిల్లింగ్‌కు గురిచేస్తున్నది. అక్టోబర్ 28న విడుదల అవుతుందని భావిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే కొన్ని ఫొటోలను విడుదల చేసిన సంగతి తెలిసిందే.
Here is the latest poster of Shivaay, tell me what you think about this?? pic.twitter.com/755tYBHbsn
— Ajay Devgn (@ajaydevgn) May 22, 2016