First poster
-
'పెళ్లి పరుగు' మూవీ ఫస్ట్ పోస్టర్ విడుదల
సాషా ప్రొడక్షన్స్ పతాకంపై శరవణ సోహాయుంగ్ హీరోగా దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం 'పెళ్లి పరుగు'. ఈ చిత్రాన్ని దివ్య శ్రీ, హీరాని, ఎస్.పి రాజా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇది పెళ్లి ఫోటోలు తీసే కొడుకుకి, ఒక తండ్రికి మధ్య జరిగే కథ. సహజమైన కథ, కథాంశంతో ఉల్లాసంగా నవ్వుకునే కామెడీ సన్నివేశాలతో జరిగే పెళ్లి వేడుకే ఈ 'పెళ్లి పరుగు' కథ. దసరా పండగ సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ పోస్టర్ ని విడుదల చేసారు. ఈ సందర్భంగా చిత్ర హీరో, దర్శకుడు శరవణ సోహాయుంగ్ మాట్లాడుతూ 'పెళ్లి పరుగు' అందమైన కుటుంబ కథ. సినిమా చాలా సహజంగా ఉంటుంది. సినిమా షూటింగ్ పూర్తి అయింది. దసరా పండగ సందర్భగా మా చిత్రం మొదటి పోస్టర్ ను విడుదల చేస్తున్నాం. తెలుగు ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు' అని తెలిపారు. -
పోర్న్ స్టార్ కాదు!
సినిమా ప్రపంచంలో షకీలా పాపులారిటీ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. 1990లో వెండితెరపై ఓ వెలుగు వెలిగారామె. అప్పట్లో ఆమె నటించిన కొన్ని అడల్ట్ సినిమాలు విదేశీ భాషల్లోనూ డబ్ చేశారు. అనేక వివాదాల్లోనూ ఆమె పేరు వినిపించింది. ఇన్ని ఆసక్తికర విషయాలు ఉన్న ఆమె జీవితం ఆధారంగా ‘షకీలా’ అనే బయోపిక్ రూపొందుతోంది. రీచా చద్దా టైటిల్ రోల్ చేస్తున్నారు. ఇంద్రజిత్ లంకేష్ దర్శకుడు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఆ పోస్టర్‌పై ‘షకీలా.. పోర్న్ స్టార్ కాదు’ అని ఉంది. ‘‘షకీలాను అందరూ పోర్న్ స్టార్‌గానే ఆలోచిస్తారు. కానీ ఆమె జీవితంలో ఎన్నో ఆసక్తికర అంశాలు ఉన్నాయి. అవి ప్రేక్షకులకు తెలియాలి’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ బయోపిక్‌లో షకీలా కూడా గెస్ట్ రోల్ చేశారు. వేసవిలో రిలీజŒ కానుంది. -
థ్రిల్లింగ్ ఫస్ట్‌లుక్: 'శివాయ్' సాహసాలు!
అజయ్ దేవగణ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక సినిమా 'శివాయ్'. దీపావళి పండుగకు విడుదల కాబోతున్న ఈ సినిమాపై చాలా అంచనాలే ఉన్నాయి. అజయ్ దేవగణ్‌తోపాటు సైరాబాను, దిలీప్‌కుమార్, సాయెషా సైగల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ పోస్టర్‌ను తాజాగా ట్విట్టర్లో విడుదల చేశారు. పరమశివుడిని తలపించే మంచుకొండల్లో హెలికాప్టర్ నుంచి తాడు పట్టుకొని సాహసాలు చేస్తున్న అజయ్ లుక్‌తో ఈ పోస్టర్ అదరగొడుతున్నది. అజయ్ అభిమానుల్ని థ్రిల్లింగ్‌కు గురిచేస్తున్నది. అక్టోబర్ 28న విడుదల అవుతుందని భావిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే కొన్ని ఫొటోలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. Here is the latest poster of Shivaay, tell me what you think about this?? pic.twitter.com/755tYBHbsn — Ajay Devgn (@ajaydevgn) May 22, 2016 -
'హాట్' టాపిక్: ఫ్రెంచ్ కిస్‌తో ఫస్ట్ పోస్టర్!
ఈఫీల్ టవర్ ఎదురుగా.. హీరో-హీరోయిన్ల మధ్య ఘాటైన 'ఫ్రెంచ్ కిస్'తో తొలి పోస్టర్‌ను విడుదల చేసింది 'బెఫికర్' టీమ్. 'బాజీరావు మస్తానీ' హీరో రణ్వీర్ సింగ్, వాణీకపూర్ లీడ్ రోల్స్‌లో కనిపిస్తున్న ఈ సినిమా తొలిచిత్రాన్ని సోమవారం అధికారికంగా విడుదల చేశారు. ఈ ఫస్ట్ పోస్టర్లో పెదవులతో పెదవులు పెనవేసుకొని.. తమకంగా 'ఫెంచ్ కిస్' పెట్టుకుంటున్న రణ్వీర్, వాణీ కపూర్ జోడీ అభిమానుల్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈఫీల్ టవర్‌కు దూరంగా ఓ ఎత్తైన బిల్డింగ్ మీద కూర్చొని వీరు ముద్దుపెట్టుకుంటూ పోస్టర్లో కనిపిస్తున్నారు. మొత్తానికి ఈ సినిమా రొమాంటిక్ లవ్ స్టోరీ అని ఫస్ట్ పోస్టర్‌తో చిత్రబృందం చెప్పకనే చెప్పిందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అత్యంత ఎత్తులో తీసిన 'ఫ్రెంచ్ కిస్' షాట్ అద్భుతమంటూ హీరోయిన్ వాణీకపూర్ ఈ ఫస్ట్ పోస్టర్‌ను ట్విట్టర్లో షేర్ చేసింది. This view from the top is breathtaking @RanveerOfficial #BefikreOn9th @befikrethefilm pic.twitter.com/syEj3jZtHY — vaani kapoor (@Vaaniofficial) May 9, 2016 -
ఫస్ట్ లుక్ వచ్చేసింది
ముంబై: బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ తాజా చిత్రం 'ఎయిర్ లిఫ్ట్' ఫస్ట్ పోస్టర్ విడుదల అయింది. రాజ్ క్రిష్ణ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఫస్ట్‌లుక్ ను సోషల్ మీడియాలో అక్షయ్ మంగళవారం రిలీజ్ చేశారు. బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న పోస్టర్‌ను ఫేస్ బుక్ పేజ్ లో, ట్విట్టర్ లో అక్షయ్ షేర్ చేశారు. ఈ సందర్భంగా 'కువైట్‌లో ఘటనలో ఎంతమంది రక్షించబడ్డారో ఎంతమందికి తెలుసు.. ఒక యథార్థ గాథను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న ఇలాంటి సినిమాలో భాగం కావడం' తనకు చాలా సంతోషంగా ఉందంటూ ట్విట్ చేశారు. కాగా కువైట్‌లో 1990లో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా రూపొందించిన చిత్రం 'ఎయిర్ లిఫ్ట్'. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, లంచ్ బాక్స్ ఫేం హీరోయిన్ నిమ్రత్ కౌర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కువైట్‌లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించే క్రమంలో ఎదురైన పరిస్థితులను దర్శకుడు రాజ్ మీనన్ చాలా అద్భుతంగా తెరకెక్కించారని అక్షయ్ అన్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 22న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. అలాగే బుధవారం చిత్ర టీజర్‌ను విడుదల చేయనున్నట్లు అక్షయ్ తెలిపారు. అక్షయ్‌తో పాటు ఈ చిత్ర సహ నిర్మాత నిఖిల్ అద్వానీ కూడా 1990 నాటి దుర్ఘటను మళ్లీ తలచుకోవడం విచారకరమని ట్విట్ చేశారు. ఏ యుద్ధంలోనైనా అమాయక ప్రజలే బలైపోతున్నారని వ్యాఖ్యానించారు.