
సాషా ప్రొడక్షన్స్ పతాకంపై శరవణ సోహాయుంగ్ హీరోగా దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం 'పెళ్లి పరుగు'. ఈ చిత్రాన్ని దివ్య శ్రీ, హీరాని, ఎస్.పి రాజా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇది పెళ్లి ఫోటోలు తీసే కొడుకుకి, ఒక తండ్రికి మధ్య జరిగే కథ. సహజమైన కథ, కథాంశంతో ఉల్లాసంగా నవ్వుకునే కామెడీ సన్నివేశాలతో జరిగే పెళ్లి వేడుకే ఈ 'పెళ్లి పరుగు' కథ. దసరా పండగ సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ పోస్టర్ ని విడుదల చేసారు.
ఈ సందర్భంగా చిత్ర హీరో, దర్శకుడు శరవణ సోహాయుంగ్ మాట్లాడుతూ 'పెళ్లి పరుగు' అందమైన కుటుంబ కథ. సినిమా చాలా సహజంగా ఉంటుంది. సినిమా షూటింగ్ పూర్తి అయింది. దసరా పండగ సందర్భగా మా చిత్రం మొదటి పోస్టర్ ను విడుదల చేస్తున్నాం. తెలుగు ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు' అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment