
కార్తీక్, సంచిత హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘లవ్..లైఫ్ అండ్ పకోడి’. ‘మధుర’ శ్రీధర్ సమర్పణలో జయంత్ గాలి స్వీయ దర్శకత్వంలో రూపొందించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా జయంత్ గాలి మాట్లాడుతూ – ‘‘నేటి తరం యువతీయువకులు ఏ రిలేషన్‌ని అయినా కమిట్ కావడానికి భయపడతారు. కన్‌ఫ్యూజ్ అవుతారు. కరెక్టా? కాదా? అనే సందేహాల్లో ఊగిసలాడతారు. వారి మధ్య ఆకర్షణలు, ప్రేమలు ఉంటాయి. కానీ వారి బాండింగ్‌కి ఎలాంటి రిలేషన్‌తో ముడిపెట్టడానికి ఇష్టపడతారన్నదే మా సినిమా కథ. ఆధునిక సంస్కృతిలో యువతరం జీవనశైలిని ప్రతిబింబించే ఈ కథ తప్పకుండా యూత్‌కు కనెక్ట్ అవుతుందని నమ్ముతున్నాను. థియేటర్స్ రీ ఓపెన్ కాగానే మా సినిమా రిలీజ్‌ను ప్లాన్ చేసుకుంటాం’’ అని అన్నారు. ఈ సినిమాకు సంగీతం: పవన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెంకట సిద్ధారెడ్డి.
Comments
Please login to add a commentAdd a comment