
సినిమా ప్రపంచంలో షకీలా పాపులారిటీ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. 1990లో వెండితెరపై ఓ వెలుగు వెలిగారామె. అప్పట్లో ఆమె నటించిన కొన్ని అడల్ట్ సినిమాలు విదేశీ భాషల్లోనూ డబ్ చేశారు. అనేక వివాదాల్లోనూ ఆమె పేరు వినిపించింది. ఇన్ని ఆసక్తికర విషయాలు ఉన్న ఆమె జీవితం ఆధారంగా ‘షకీలా’ అనే బయోపిక్ రూపొందుతోంది. రీచా చద్దా టైటిల్ రోల్ చేస్తున్నారు.
ఇంద్రజిత్ లంకేష్ దర్శకుడు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఆ పోస్టర్‌పై ‘షకీలా.. పోర్న్ స్టార్ కాదు’ అని ఉంది. ‘‘షకీలాను అందరూ పోర్న్ స్టార్‌గానే ఆలోచిస్తారు. కానీ ఆమె జీవితంలో ఎన్నో ఆసక్తికర అంశాలు ఉన్నాయి. అవి ప్రేక్షకులకు తెలియాలి’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ బయోపిక్‌లో షకీలా కూడా గెస్ట్ రోల్ చేశారు. వేసవిలో రిలీజŒ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment