
‘‘షకీలా సినిమా అంటేనే సెన్సార్ ఇవ్వరు. అలాంటిది నా బయోగ్రఫీ అంటే ఎంత కష్టపడి సెన్సార్ తీసుకుని ఉంటారో నాకు తెలుసు. జనవరి 1న విడుదలవుతున్న ‘షకీలా’ సినిమాని ఎంటర్‌టైన్‌మెంట్ మోటివ్‌లోనే చూడండి. ఈ సినిమా నా లైఫ్ గురించి అనే కాదు, కొన్నిచోట్ల సినిమాటిక్ లిబర్టీ తీసుకోవడం జరిగింది’’ అన్నారు షకీలా. నటి షకీలా జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘షకీలా’. రీచా చద్దా, పంకజ్ త్రిపాఠి, ఎస్తర్‌లు కీలక పాత్రలు పోషించారు. ఇంద్రజిత్ లోకేష్ రచించి, దర్శకత్వం వహించారు. ప్రకాశ్ పళని సమర్పణలో సమ్మి నన్వని, శరవణ ప్రసాద్ నిర్మించారు. ఎస్తర్ మాట్లాడుతూ– ‘‘చాలారోజుల తర్వాత ఒక మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నందుకు హ్యాపీగా ఉంది. షకీలా లైఫ్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న స్ట్రాంగ్ క్యారెక్టర్‌ను ఈ సినిమాలో చేశాను’’ అన్నారు. యూఎఫ్‌ఓ ప్రతినిధి లక్ష్మణ్, రాజీవ్ పిళ్లై, ఉపాసన తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment