నాకు నేనే అతిథి... | Richa Chadda to star in actor Shakeela's biopic | Sakshi
Sakshi News home page

నాకు నేనే అతిథి...

Published Thu, Nov 1 2018 2:53 AM | Last Updated on Thu, Nov 1 2018 2:53 AM

Richa Chadda to star in actor Shakeela's biopic - Sakshi

షకీల

... అంటున్నారు నటి షకీల. శృంగార తారగా ఎందరో యువ హృదయాలను కొల్లగొట్టారు షకీల. శృంగార తారగా ఓ వెలుగు వెలిగిన షకీల జీవితాన్ని మలయాళ దర్శకుడు ఇంద్రజిత్‌ లంకేష్‌ వెండితెరపై ఆవిష్కరిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలన్నీ ఈ చిత్రంలో ఉంటాయని సమాచారం. తన జీవితంలో జరిగిన ప్రతి సంఘటనను దాచిపెట్టకుండా చిత్రబృందానికి తెలిపానని షకీల గతంలో చెప్పారు. ఆమె పాత్రలో బాలీవుడ్‌ నటి రిచా చద్దా నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ దాదాపు పూర్తి కావొచ్చిందట. తన జీవిత కథతో తెరకెక్కుతోన్న సినిమాలో షకీల అతిథి పాత్రలో మెరవనుండటం విశేషం. అతిథి పాత్రలో నటించమని ఇంద్రజిత్‌ లంకేష్‌ కోరడంతో గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారట ఆమె.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement