
మోహన్‌లాల్
హీరో సూర్యతో రాజకీయాలు చేస్తున్నారు మలయాళ నటుడు మోహన్‌లాల్. కానీ ఇది వెండితెరపై మాత్రమే. మరి.. ఈ రాజకీయ లబ్ధి ఎవరికి? అనేది తెలుసుకోవడానికి సమయం పడుతుంది. కేవీ ఆనంద్ దర్శకత్వంలో సూర్య హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో సాయేషా కథానాయికగా నటిస్తున్నారు. మోహన్‌లాల్, ఆర్య, బొమన్ ఇరానీ కీలక పాత్రలు చేస్తున్నారు. ఇందులో హీరో సూర్య నేషనల్ సెక్యూరిటీ కమాండో పాత్రలో కనిపిస్తారు. మోహన్‌లాల్ రాజకీయ నాయకుడి పాత్ర చేస్తున్నారని టాక్. మోహన్‌లాల్ లుక్‌కు చెందిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పై ఫొటో అదే.
Comments
Please login to add a commentAdd a comment