
సూర్య
సినిమా సినిమాకు హీరో సూర్య అస్సలు గ్యాప్ ఇవ్వడం లేదు. సెల్వరాఘవన్ దర్శకత్వంలో సూర్య హీరోగా నటించిన ‘ఎన్‌జీకే’ (నందగోపాలకుమరన్) చిత్రం మే31న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కేవీ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘కాప్పాన్’ చిత్రం షూటింగ్‌లో పాల్గొంటున్నారు సూర్య. ‘కాప్పాన్’ చిత్రం ఆగస్టులో విడుదల కానుందని సమాచారం. ఈ సినిమా చిత్రీకరణ ఆల్మోస్ట్ పూర్తయింది.
ఆ నెక్ట్స్ ‘గురు’ ఫేమ్ సుధా కొంగర దర్శకత్వంలో హీరోగా నటిస్తారు సూర్య. ఈ సినిమా పూజాకార్యక్రమం వచ్చే నెలలో జరగనుందని తెలిసింది. ఈ సినిమాకు నటుడు, సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ స్వరాలు సమకూర్చుతున్నారు. ‘‘సూర్య నెక్ట్స్ చిత్రానికి ఆడియో వర్క్ చేస్తున్నాను. అతి త్వరలో చిత్రీకరణ స్టార్ట్ అవుతుంది. ఈ సినిమా ప్రారంభోత్సవం రోజున ఓ కొత్త విషయాన్ని తెలియజేస్తాను’’ అని పేర్కొన్నారు జీవీ ప్రకాష్.
Comments
Please login to add a commentAdd a comment