'అఖిల్' మూవీ రివ్యూ | akkineni akhil first film akhil review | Sakshi
Sakshi News home page

'అఖిల్' మూవీ రివ్యూ

Published Wed, Nov 11 2015 8:39 AM | Last Updated on Sun, Sep 3 2017 12:22 PM

'అఖిల్' మూవీ రివ్యూ

'అఖిల్' మూవీ రివ్యూ

టైటిల్ : అఖిల్
జానర్ : రొమాంటిక్, యాక్షన్ ఎంటర్టైనర్
తారాగణం : అఖిల్, సయేషా సైగల్, రాజేంద్ర ప్రసాద్, మహేష్ మంజ్రేకర్
దర్శకత్వం : వి.వి. వినాయక్
నిర్మాత : శ్రేష్ట్ మూవీస్
సంగీతం : అనూప్ రుబెన్స్, థమన్

అక్కినేని వంశంలో మూడో తరం నట వారసుడిగా భారీ అంచనాల మధ్య తెరంగేట్రం చేసిన నటుడు అఖిల్. గతంలో ఏ హీరోకి రాని హైప్ అఖిల్ తొలి సినిమాకు వచ్చింది. అందుకు తగ్గట్టుగానే భారీ బడ్జెట్తో అఖిల్ సినిమాను తెరకెక్కించారు. అఖిల్ లుక్కు తగ్గట్టుగా క్లాస్ రొమాంటిక్ సీన్స్ తో పాటు, వినాయక్ మార్క్ మాస్ ఎలిమెంట్స్ కూడా పుష్కలంగా ఉన్న అఖిల్ దీపావళి కానుకగా బుధవారం ఆడియన్స్ ముందుకు వచ్చింది. సోషియో ఫాంటసీ తరహా కథాంశంతో తెరకెక్కిన అఖిల్ ఆడియన్స్ను ఎంత వరకు మెప్పించింది. భారీ అంచనాల మధ్య వెండితెరకు పరిచయం అయిన అఖిల్ ఆ అంచనాలను అందుకున్నాడా..?

కథ :
అఖిల్ హ్యాపీగా జీవితాన్ని గడిపే ఓ సాదాసీదాకుర్రాడు. అలా జీవితం సాగిపోతున్న సమయంలో పిజి చదువుతున్న హీరోయిన్ సయేషాతో ప్రేమలో పడతాడు. ఆమెను ఒప్పించి ప్రేమను గెలుచుకుంటాడు. ఇంతలో కొంత మంది రౌడీలు సయోషాను కిడ్నాప్ చేస్తారు. ఆమె కోసం వెతికే ప్రయత్నంలో ఆమె ఆఫ్రికాలో ఉందని తెలుసుకున్న అఖిల్ అక్కడికి వెళతాడు. తన ప్రియురాళిని కాపాడుకోవటానికి అక్కడి గిరిజనుల సాయం తీసుకుంటాడు. అసలు ఆ గిరిజనులు ఎవరు. సయేషాను విలన్లు ఎందుకు కిడ్నాప్ చేశారు. అక్కడికి వెళ్లిన అఖిల్ జీవితం ఎలా మారిపోయింది అన్నదే మిగతా కథ.

నటీనటులు :
అఖిల్ పూర్తి స్థాయి ఫాంటసీ కథాంశం కాకపోయినా, చిన్న ఫాంటసీ లైన్ను రియలిస్టిక్గా రూపొందించారు. ముఖ్యంగా అఖిల్ లాంచింగ్ సినిమా కావటంతో, కథా కథనాలు అన్ని అఖిల్ పాత్ర చుట్టూ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అందుకు తగ్గట్టుగానే అఖిల్ కూడా తన మీద ఉన్న బాధ్యతకు పూర్తి న్యాయం చేశాడు. తొలి సినిమానే అయినా ఎక్కడ అలా కనిపించలేదు. డ్యాన్స్, ఫైట్స్ తో పాటు డైలాగ్ డెలివరీ బాడీలాంగ్వేజ్ వంటి విషయాల్లో కూడా మంచి ఈజ్ కనబరిచాడు. అయితే కామెడీ విషయంలో మాత్రం ఇంకాస్త వర్క్ చేస్తే బాగుండనిపించింది.

హీరోయిన్గా నటించిన సయేషా సైగల్ కూడా మంచి నటన కనబరిచింది. ముఖ్యంగా డ్యాన్స్ల విషయంలో అఖిల్తో పోటి పడిన సయేషా మంచి మార్కులు సాధించింది. బ్రహ్మనందం, జయప్రకాష్ రెడ్డిల కామెడీ అలరిస్తుంది. ఇక రాజేంద్రప్రసాద్ మరోసారి ఆకట్టుకోగా, విలన్గా మహేష్ మంజ్రేకర్ తన మార్క్ చూపించాడు.

సాంకేతిక నిపుణులు :
తెర మీద అఖిల్ వన్ మేన్ షోలా సాగిన అఖిల్ సినిమా. తెర వెనుక వినాయక్ వన్ మేన్ షోలా సాగింది. ఎన్నో అంచనాలు ఉన్న అక్కినేని వారసున్ని వెండితెరకు పరిచయం చేసే భారీ బాధ్యతను తలకెత్తుకున్న వినాయక్ అందుకు తగ్గ స్ధాయిలో కష్టపడ్డాడు. ముఖ్యంగా తనకు బాగా పట్టున్న మాస్ యాక్షన్ను క్లాస్గా ప్రజెంట్ చేసి, స్టార్ వారసులకు గ్రాండ్ లాంచింగ్ ఇవ్వటంలో తాను స్పెషలిస్ట్ అని ప్రూవ్ చేసుకున్నాడు. కథా కథనాల్లో ఎక్కడా పట్టు కోల్పోకుండా సినిమా అంతా చాలా ఇంట్రస్టింగ్గా తెరకెక్కించాడు. అనూప్, థమన్లు కమర్షియల్ నెంబర్స్తో అలరించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. కెమెరా వర్క్ సూపర్ అనిపించింది. గతంలో ఎన్నడూ చూడని లొకేషన్స్లో షూట్ చేసిన చిత్రయూనిట్, ఆ ప్రాంతాలను గ్రాండ్గా ప్రజెంట్ చేశారు. అఖిల్, సయేషాలు తెర మీద చాలా అందంగా కనిపించారు. ఎడిటింగ్, కొరియోగ్రఫీ, యాక్షన్స్ సీన్స్ ఇలా అన్నీ అప్ టు ద మార్క్ గా ఉన్నాయి.

విశ్లేషణ :
అఖిల్ ఫాంటసీ కథాంశం కాకపోయినా.. చిన్న ఫాంటసీ ఎలిమెంట్ను పక్కా కమర్షియల్ జానర్లో ప్రజెంట్ చేశారు. అఖిల్ తొలి సినిమానే అయినా ఓ స్టార్ హీరో సినిమాలో ఉండే అన్ని ఎమోషన్స్ను ఈ సినిమాలో చూపించారు. ఫ్యామిలీ సెంటిమెంట్, లవ్ ఎపిసోడ్స్, యాక్షన్, డ్రామా ఇలా అన్ని రకాల సీన్స్తో అఖిల్ స్టామినా ప్రూవ్ చేసే ప్రయత్నం చేశారు. సినిమా కూడా అదే స్ధాయిలో వచ్చింది. పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఆకట్టుకుంది.

ప్లస్ పాయింట్స్ :
అఖిల్ పర్ఫామెన్స్, డ్యాన్స్, యాక్షన్
వినాయక్ టేకింగ్
సినిమా నిడివి
బ్యాగ్ గ్రౌండ్ స్కోర్

మైనస్ పాయింట్స్ :
రొటీన్ స్టోరీ లైన్
సెకండాఫ్ లో కొన్ని సీన్స్
గ్రాఫిక్స్

ఓవరాల్గా 'అఖిల్' అక్కినేని అభిమానులకు ఫుల్ ట్రీట్, అఖిల్ కు పర్ఫెక్ట్ లాంచింగ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement