సాయేషా, కార్తీ
‘ఆవారా, నా పేరు శివ, ఖాకి.. వంటి చిత్రాలతో తమిళ హీరో కార్తీ తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. ఆయన హీరోగా పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కడై కుట్టి సింగమ్’. తెలుగులో ‘చినబాబు’ అనే టైటిల్ ఖరారు చేశారు. సాయేషా, ప్రియా భవానీ శంకర్ కథానాయికలుగా నటించారు. 2డీ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై కార్తీ అన్నయ్య, హీరో సూర్య నిర్మించారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యింది. అంటే ‘చినబాబు’ ముగించేశాడన్నమాట.
గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రైతు పాత్రలో నటించారు కార్తీ. సినిమా రిలీజ్‌పై త్వరలో అధికారిక ప్రకటన రానుంది. అప్పుడే తన నెక్ట్స్ చిత్రంపై కూడా కార్తీ ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం ఆ సినిమాలోని న్యూ లుక్ కోసం కసరత్తులు చేస్తున్నారు. కొత్త దర్శకుడు రజత్ రవిశంకర రూపొందించనున్న ఈ సినిమాలో రకుల్‌ప్రీత్‌సింగ్ కథనాయికగా నటించనున్నారు. ఫస్ట్ షెడ్యూల్‌లో భాగంగా చెన్నై, హైదరాబాద్‌లలో షూటింగ్ జరిపి ఆ తర్వాత యూరప్ వెళ్లాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోందని కోలీవుడ్ టాక్.
Comments
Please login to add a commentAdd a comment