
నా పేరు శివ, ఆవారా సినిమాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో కార్తీ. ఊపిరి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కార్తీ గతేడాది ఖాకీ సినిమాతో హిట్‌కొట్టి మంచి ఫామ్‌లోకి వచ్చాడు. రీసెంట్‌గా చినబాబుగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ సాధించాడు.
కుటుంబ కథా, రైతు, గ్రామీణ వాతావరణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను హీరో సూర్య నిర్మించారు. ఈ సినిమా యూనిట్ సక్సెస్‌మీట్‌లు నిర్వహిస్తూ ఉంది. వీటికి హాజరయ్యేందుకు విచ్చేస్తోన్న కార్తీ.. ట్రాఫిక్, వర్షం కారణంగా ఆలస్యమవుతుండటంతో.. ఏమాత్రం ఆలోచించకుండా ఆటోలో కార్యక్రమానికి వచ్చాడు. కార్తీ అలా రావడంతో అక్కడ ఉన్నవారంతా అవాక్కయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment