టెడ్డీలో జోడీ | Newly weds Arya and Sayyeshaa pair up for a new movie | Sakshi
Sakshi News home page

టెడ్డీలో జోడీ

Published Sun, Mar 17 2019 3:17 AM | Last Updated on Mon, Apr 8 2019 6:20 PM

Newly weds Arya and Sayyeshaa pair up for a new movie - Sakshi

ఆర్య, సాయేషా

కోలీవుడ్‌ న్యూ కఫుల్‌ ఎవరంటే ఎవరైనా సరే ఆర్య, సాయేషా అని చెబుతారు. ‘గజనీకాంత్‌’ చిత్రం షూటింగ్‌ టైమ్‌లో ఈ ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ‘కాప్పాన్‌’ సినిమాలో కలసి నటిస్తున్న సమయంలో వివాహం చేసుకున్నారు. వివాహానంతరం ఈ జంట ‘టెడ్డీ’ అనే కొత్త సినిమాలో యాక్ట్‌ చేయడానికి రెడీ అయ్యారు. శక్తి సౌందరరాజన్‌ దర్శకత్వంలో కేఈ జ్ఞానవేల్‌రాజా నిర్మించనున్న చిత్రం ‘టెడ్డీ’.  ఈ సినిమాను ఆర్య, సాయేషా వివాహం రోజే (మార్చి 10)అనౌన్స్‌ చేయడం విశేషం. మే నుంచి ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలు కానుంది. చిన్నపిల్లలు, యూత్‌ ఎక్కువగా కనెక్ట్‌ అయ్యే ఈ చిత్రం చెన్నై, యూరప్‌లో చిత్రీకరణ జరుపుకోనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement