కార్తీ
ఖాకీ వేసుకొని దొంగల్ని ఏరిపారేసిన కార్తీ పంచె కట్టుకొని కలుపు మొక్కల్ని ఏరిపారేస్తున్నారు. తుపాకీ పట్టుకొని గూండాల శరీరాన్ని తూట్లు పొడిచేసిన కార్తీ ఇప్పుడు నారు మాగాణిలో నాట్లు వేస్తున్నారు. ఏం చెబుతున్నామో అర్థం కావడం లేదా? కార్తీ నటించిన లాస్ట్ సినిమా ‘ధీరన్ అధిగారం ఒండ్రు’ తెలుగులో ‘ఖాకీ’ సినిమా పేరుతో రిలీజైన విషయం తెలిసిందే.
అందులో ఆయన పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు కార్తీ నటిస్తున్న కొత్త సినిమా ‘కడైకుట్టి సింగం’ తెలుగులో ‘చిన్నబాబు’గా రిలీజ్ కానుంది. ఇందులో ఆయన ఓ పల్లెటూరి రైతు పాత్రలో కనిపిస్తారు. కార్తీ సోదరుడు సూర్య తన సొంత బ్యానర్ 2డీ ఎంటర్‌టైన్మెంట్ పై ఈ సినిమాను నిర్మిస్తుండటం విశేషం. పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో సయేషా కథానాయిక. డి.ఇమ్మాన్ సంగీత దర్శకుడు. ఏప్రిల్ 13న ఈ సినిమా విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment