సూర్య
రాత్రివేళ మైనస్ 7 డిగ్రీల చలిలో సూర్య ఓ ఆపరేషన్ చేస్తున్నారట. ఈ ఆపరేషన్ వెనక స్టోరీని మాత్రం వెండితెరపై చూడాల్సిందే. సూర్య హీరోగా కేవీ ఆనంద్ దర్శకత్వంలో ‘కాప్పాన్’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. సాయేషా కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో బొమన్ ఇరానీ, మోహన్‌లాల్, ఆర్య కీలక పాత్రలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చంఢీఘర్‌లో జరుగుతోంది. ‘‘మైనస్ 7 డిగ్రీల చలిలో రాత్రివేళ ‘కాప్పాన్’ సినిమా షూటింగ్ జరుపుతున్నాం’’ అని దర్శకుడు కేవీ ఆనంద్ పేర్కొన్నారు.
ఇందులో సూర్య ఎన్‌ఎస్‌జీ కమాండో పాత్రలో నటిస్తున్నారు. మోహన్‌లాల్ ప్రధానమంత్రి పాత్రలో నటిస్తున్నారని కోలీవుడ్ టాక్. ఇక ఈ సంగతి ఇలా ఉంచితే... ‘సింగమ్’ సిరీస్‌తో హిట్ కాంబినేషన్ అనిపించుకున్న సూర్య–హరి మరో సినిమా చేయనున్నారట. ఈ సినిమాకు ‘యానై’ అనే టైటిల్ కూడా అనుకుంటున్నారట. యానై అంటే తెలుగులో ఏనుగు అని అర్థం. అలాగే ఇటీవల ‘ఎన్‌జీకే’ సినిమా షూట్‌ను కంప్లీట్ చేశారు సూర్య. సెల్వరాఘవన్ దర్శకత్వంలో రూపొందిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ సమ్మర్‌లో విడుదల కానుందని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment