మంచు మోహన్ బాబు
మంచు మోహన్ బాబు కథానాయకునిగా తెరకెక్కనున్న చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’. ఈ చిత్రానికి పాపులర్ స్క్రిప్ట్, డైలాగ్ రైటర్ డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహించనున్నారు. శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంస్థలు ఈ సినిమా నిర్మించనున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం ‘సన్ ఆఫ్ ఇండియా’ టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్‌లో తీక్షణంగా చూస్తున్న మోహన్ బాబు కనిపిస్తున్నారు. ‘‘ఇంతవరకు తెలుగుతెరపై కనిపించని కథ, జానర్‌ని ఈ సినిమాలో చూడబోతున్నాం.
ఇదివరకెన్నడూ మనం చూడని పవర్‌ఫుల్ పాత్రను మోహన్ బాబు పోషిస్తున్నారు. ఈ సినిమాకు పని చేసే సాంకేతిక నిపుణులు, నటీనటుల వివరాలను త్వరలోనే చెబుతాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. కాగా కొత్త సినిమాలు ఒప్పుకొనే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు మోహన్‌బాబు. నటునిగా తనను ఉత్తేజపరిచే సినిమాలే చేయాలని నిర్ణయించుకున్నారు. 560కి పైగా చిత్రాల్లో నటించిన ఆయన ‘ఆకాశమే నీ హద్దురా’ కథ నచ్చి, ఈ చిత్రంలో కీలక పాత్ర చేశారు. సూర్య హీరోగా రూపొందిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment