అఖిల్ ఆడియోకు రికార్డ్ రేటు | big price for akhil movie audio rights | Sakshi
Sakshi News home page

అఖిల్ ఆడియోకు రికార్డ్ రేటు

Published Thu, Sep 17 2015 8:45 AM | Last Updated on Sun, Sep 3 2017 9:34 AM

అఖిల్ ఆడియోకు రికార్డ్ రేటు

అఖిల్ ఆడియోకు రికార్డ్ రేటు

అక్కినేని నటవారసుడు అఖిల్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న తొలి సినిమా రిలీజ్కు ముందు నుంచే సంచలనాలను నమోదు చేస్తుంది. గతంలో ఏ హీరో తొలి సినిమాకు లేని విధంగా భారీ హైప్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా అదే స్ధాయిలో 40 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో రూపొందుతోంది. స్టార్ మేకర్ వినాయక్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ సినిమా మీద అంచనాలను మరింత పెంచేస్తున్నాయి.

ఈ హైప్ అఖిల్ సినిమా బిజినెస్ మీద కూడా బాగానే ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే సినిమా బిజిసెన్ కూడా పూర్తవ్వటంతో నిర్మాతలు చాలా హ్యాపిగా ఉన్నారు. దీనికి తోడు తాజాగా ఆడియో రిలీజ్ హక్కుల విషయంలోనూ అదే జోరు చూపించాడు అఖిల్.. గతంలో అత్యంత భారీ వ్యయానికి ఆడియో రిలీజ్ హక్కులను అమ్మిన రికార్డ్ ఇండియాస్ బిగెస్ట్ మోషన్ పిక్చర్ బాహుబలి పేరిట ఉంది.

బాహుబలి తరువాత స్థానంలో నిలిచాడు అఖిల్. దీంతో తొలి సినిమాతోనే ఈ ఘనత సాదించిన హీరోగా రికార్డ్ సృష్టించాడు. యంగ్ హీరో నితిన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సయేషా సెహగల్ అఖిల్ సరసన హీరోయిన్ గానటిస్తుంది. తమన్తో పాటు అనూప్ రుబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆడియో అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా సెప్టెంబర్ 20 రిలీజ్ కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement