ఒకప్పుడు కేవలం అలాంటి సినిమాలే: మలయాళ ఇండస్ట్రీపై ఆర్జీవీ కామెంట్స్‌! | Ram Gopal Varma says earlier Malayalam cinema only That Type Of films | Sakshi
Sakshi News home page

Ram Gopal Varma: 'అప్పట్లో అన్నీ అలాంటి చిత్రాలే'.. మలయాళంపై ఆర్జీవీ కామెంట్స్!

Published Mon, Aug 5 2024 7:20 PM | Last Updated on Mon, Aug 5 2024 7:49 PM

Ram Gopal Varma says earlier Malayalam cinema only That Type Of films

టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఇటీవల కల్కి చిత్రంలో అతిథిపాత్రలో మెరిశారు. ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అయితే తాజాగా ఆర్జీవీ మలయాళ సినిమా ఇండస్ట్రీపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. గతంలో మలయాళ చిత్రాలు కేవలం అడల్ట్, రొమాంటిక్‌ కంటెంట్‌తో మాత్రమే వచ్చేవని అన్నారు.

రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ..'ఒకప్పుడు మలయాళం సినిమా అంటే కేవలం అడల్ట్‌ కంటెంట్ మాత్రమేనని మనందరికీ తెలుసు. నేను విజయవాడలో ఇంజినీరింగ్ చేస్తున్న రోజుల్లో మలయాళ సినిమాలు చూడలేదు. ఎందుకంటే  ఇతర సినిమాలతో పోలిస్తే ఎక్కువ అడల్ట్‌ కంటెంట్‌తో మాత్రమే వచ్చేవి. కానీ ఇప్పుడు మాత్రం మలయాళం నుంచి ఉత్తమ చిత్రాలు వస్తున్నాయి. అయితే ఆ సమయంలో మంచి సినిమాలు లేవని కాదు. బహుశా అప్పట్లో డిస్ట్రిబ్యూటర్లు ఏదైనా కారణాలతో అలాంటి సినిమాలు తీసుకొచ్చి ఉంటారేమో. వారిని ప్రభావితం చేసిన అనేక అంశాలు ఉండొచ్చు.' అని అన్నారు,

ది కేరళ స్టోరీపై ప్రశంసలు..

ది కశ్మీర్ ఫైల్స్, యానిమల్ లాంటి వివాదాస్పద చిత్రాలపై ఆర్జీవీ ప్రశంసలు కురిపించారు. తాను చూసిన ఉత్తమ చిత్రాలలో ది కేరళ స్టోరీ ఒకటని ఆయన తెలిపారు. అలాగే ప్రశాంత్ వర్మ చిత్రం హను-మాన్, నాగ్ అశ్విన్ తాజా బ్లాక్‌బస్టర్‌ కల్కి 2898 AD సినిమాలు అధ్బుతమని కొనియాడారు.  శివ మూవీతో దర్శకుడిగా కెరీర్‌ ప్రారంభించిన ఆర్జీవీ టాలీవుడ్‌కు పలు సూపర్ హిట్ చిత్రాలను అందించారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement