
సాక్షి, తాడేపల్లి: తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద గోశాలలో జరిగిన శాంతి యజ్ఞంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. ఇటీవల విజయవాడలో ఏపీ దేవాదాయ, ధర్మాదాయ శాఖ నిర్వహించిన అష్టోత్తర శతకుండాత్మక (108) చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహా యజ్ఞంలో సీఎం పాల్గొన్న సంగతి తెలిసిందే.
మహాయజ్ఞం విజయవంతంగా పూర్తయిన సందర్భంగా వేద పండితుల సూచనల మేరకు, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు నిమిత్తం గోశాలలో శాంతి యజ్ఞం నిర్వహించారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం (దేవాదాయ, ధర్మాదాయశాఖ) కొట్టు సత్యనారాయణ పాల్గొన్నారు.
చదవండి: ‘వైఎస్ జగన్‌ది మేనిఫెస్టో.. చంద్రబాబుది మోసఫెస్టో’
Comments
Please login to add a commentAdd a comment