ఫ్యాన్ గుర్తుకు ఓటెయ్యండి | Srikakulam Parliament candidate Shanti elections Campaign | Sakshi
Sakshi News home page

ఫ్యాన్ గుర్తుకు ఓటెయ్యండి

Published Thu, Apr 10 2014 2:57 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM

ఫ్యాన్ గుర్తుకు ఓటెయ్యండి - Sakshi

ఫ్యాన్ గుర్తుకు ఓటెయ్యండి

లోద్దపుట్టి (ఇచ్ఛాపురం), న్యూస్‌లైన్: ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి, వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని  ఆ పార్టీ శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం అభ్యర్థి రెండి శాంతి ఓటర్లకు విజ్ఞప్తి చేశా రు. బుధవారం మధ్యాహ్నం ఆమె పార్టీ నాయకులతో కలిసి..లొద్దపుట్టి గ్రామంలో  ఇంటింటా ప్రచారం చేశారు. ఓటర్ల వద్దకు వెళ్లి..ఫ్యాన్‌గుర్తుపై ఓటు వేయాలని, లొద్దపుట్టి ఎంపీటీసీ అభ్యర్థి పిట్ట హేమలతను గెలిపించాలని కోరారు. మహిళల వద్దకు వెళ్లి..వారిని ఆప్యాయంగా పలకరించి, వారి కష్టాలను తెలుసుకున్నారు. వికలాంగ, వృద్ధ మహిళలతో మాట్లాడారు. జగన్ మోహన్ రెడ్డి  నాయకత్వంలో  రాష్ట్రంలో రాజన్న పాలన వస్తుందని, అందరి కష్టాలు తీరుతాయని వివరించారు. స్థానిక మహిళలతో కలిసి..వడ్లు దంచారు. చిరు వ్యాపారులు, పనుల్లో ఉన్న మహిళల వద్దకు వెళ్లి..పలకరించి..వైఎస్‌ఆర్‌సీపీని బలపరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త నర్తు రామారావు, మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్, ఆయన సతీమణి విజయ, పార్టీ నాయకులు సాడి శ్యాంప్రసాద్ రెడ్డి, డాక్టర్ కె.గోవిందరెడ్డి, మండల కన్వీనర్లు కారంగి మోహనరావు, పిట్ట ఆనంద్, జిల్లా ట్రేడ్ యూనియన్ కార్యదర్శి సుగ్గు ఛత్రపతి రెడ్డి, సేవాదళ్ కన్వీనర్ తిప్పన రామారావు, మాజీ ఎంపీపీ తిలక్, అనపాన పితాంబర్, పైల రంగయ్య తదితరులు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement