శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ ఆధిక్యం సాధించింది. ఇక్కడ మొత్తం 10 అసెంబ్లీ స్థానాలుండగా మూడు చోట్ల వైఎస్ఆర్సీపీ, ఏడు స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు గెలిచారు. ఇక్కడున్న ఏకైక లోక్సభా స్థానం శ్రీకాకుళంలో టీడీపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడు విజయం సాధించారు. సమైక్య ఉద్యమంలో ప్రజలకు ద్రోహం చేసిన కాంగ్రెస్ నాయకురాలు, కేంద్ర మాజీమంత్రి కిల్లి కృపారాణి దారుణ ఓటమి చవిచూశారు. ఉద్యమాన్ని కించపరిచేలా మాట్లాడి ఈ ప్రాంతవాసుల మనోభావాలను దెబ్బతీసిన కేంద్ర మాజీ మంత్రికి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు.
ఇక అసెంబ్లీ స్థానాల విషయానికి వస్తే...
* పాతపట్నంలో టీడీపీ తరఫున పోటీ చేసిన మాజీమంత్రి శత్రుచర్ల విజయరామరాజుపై వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కె.వెంకటరమణ 3812 ఓట్ల మెజారిటీతో గెలిచారు.
* రాజాంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కంబాల జోగులు 512 ఓట్ల తేడాతో టీడీపీ నాయకురాలు ప్రతిభా భారతిని ఓడించారు.
* పాలకొండలో టీడీపీ అభ్యర్థి జయకృష్ణపై వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని వి.కళావతి 1553 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
* ఇచ్ఛాపురం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి బెందాళం అశోక్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి రామారావు పై గెలిచారు.
* టెక్కలి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి కింజరాపు అచ్చెన్నాయుడు విజయం సాధించారు.
* శ్రీకాకుళంలో టీడీపీ అభ్యర్థి కుందా లక్ష్మీదేవి చేతిలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి, మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు ఓడిపోయారు.
* ఆమదాలవలసలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన కూన రవికుమార్ విజయం సాధించారు.
* నరసన్నపేటలో టీడీపీ నాయకుడు బి.రమణమూర్తి చేతిలో సిట్టింగ్ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ నాయకులు ధర్మాన కృష్ణదాస్ ఓడిపోయారు.
* పలాసలో టీడీపీ అభ్యర్థి గౌతు శ్యామసుందర శివాజీ చేతిలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వి.బాబూరావును ఓడించారు.
* ఎచ్చెర్లలో టీడీపీ సీనియర్ నేత నేత కళా వెంకట్రావు చేతిలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి జి.కిరణ్ కుమార్ ఓడిపోయారు.
సిక్కోలులో తెలుగుదేశానికి ఆధిక్యం
Published Fri, May 16 2014 6:52 PM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement
Advertisement