వెంకి, అను ఉపాధ్యాయ, గోపికృష్ణ, శాంతి, హని, నాని ప్రధాన పాత్రధారులుగా ఓ చిత్రం రూపొందుతోంది. భవానీ మస్తాన్ దర్శకుడు. పొట్లాబత్తుని శివశంకరరావు నిర్మాత. ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తి చేసుకుంది. హారర్ నేపథ్యంలో రూపొందించిన ఈ థ్రిల్లర్ ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తుందని దర్శకుడు చెప్పారు. విజయవాడ, మంగళగిరి పరిసరాల్లో జరిపిన చిత్రీకరణతో టాకీ పార్ట్ పూర్తయిందని, అందమైన లొకేషన్లలో పాటలను చిత్రీకరించి డిసెంబర్‌లో చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: వెంకట్, సంగీతం: నాని.
ఉత్కంఠతో...
Published Tue, Sep 23 2014 10:59 PM | Last Updated on Sat, Sep 2 2017 1:51 PM
Advertisement
Advertisement