
జబర్ధస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ గత కొద్దిరోజులుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. దీని కోసం ఆయన డయాలసిస్ చికిత్స తీసుకుంటున్నారు. రెగ్యులర్‌గా డయాలసిస్ చేయించుకుంటున్నా ఆరోగ్యంలో ఎలాంటి మార్పు రాలేదు. అంతే కాకుండా రోజు రోజుకు కొత్త అనారోగ్య సమస్యలు ఆయన్ని చుట్టుముడుతున్నాయి. ఇటీవలే తీవ్రమైన జ్వరంతో ఆస్పత్రిలో పంచ్ ప్రసాద్ మరోసారి ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం గొంతు సమస్యతో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఈ విషయాన్ని ఆయన భార్య తమ యూట్యూబ్ ఛానెల్ ద్వారా పంచుకున్నారు.
(ఇది చదవండి: ‘పుష్ప -2’ టీజర్.. ఐకాన్ స్టార్ దెబ్బకు యూట్యూబ్ షేక్)
పంచ్ ప్రసాద్ భార్య మాట్లాడుతూ.. 'ఇప్పుడు ఆసుపత్రికి వచ్చాం. ఇప్పటికే ఆయనకు థైరాయిడ్ సమస్య ఉంది. అది మరింత తీవ్రంగా మారింది. అల్ట్రా సౌండ్ స్కానింగ్ తర్వాత రిపోర్టులు చూసిన డాక్టర్స్ సర్జరీ చేయాలని చెప్పారు. ఆయన కాలికి లెగ్ ఇన్‌ఫెక్షన్ కూడా ఉండడంతో సర్జరీ ఇప్పుడే వద్దని చెప్పారు. లెగ్ ఇన్‌ఫెక్షన్ తగ్గిన తరువాత సర్జరీ చేస్తామని డాక్టర్లు అన్నారు. మెడిసిన్స్‌తో తగ్గాలని దేవుడిని కోరుకుంటున్నా.' అని ఆమె అన్నారు. కాగా, పంచ్ ప్రసాద్ తన పేరు మీద ఓ యూట్యూబ్ ఛానల్‌ను నిర్వహిస్తున్నారు. తన ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇది చూసిన ఆయన అభిమానులు త్వరగా కోలుకోవాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment