
జబర్దస్త్ శాంతి అలియాస్ శాంతిస్వరూప్ బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. తన కామెడీతో అభిమానులను అలరించిన శాంతిస్వరూప్‌కు ఇండస్ట్రీలో జబర్దస్త్ శాంతిగానే పేరు ముద్రపడిపోయింది. కామెడీ షోతో గుర్తింపు తెచ్చుకున్న శాంతి బుల్లితెరపై తనకంటూ ప్రత్యేకతను చాటుకుంది. తన కామెడీతో అందరినీ నవ్వించిన జబర్దస్త్ శాంతి.. ఇటీవలే తల్లికి ప్రస్తుతం సర్జరీ చేయాల్సి వచ్చిందని తెలిపారు. అమ్మ ఆస్పత్రి ఖర్చుల కోసం డబ్బులు లేకపోవడంతో ఏకంగా తన ఇంటిని అమ్మకానికి పెట్టినట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా తన కల సాకారం కాబోతోంది అంటూ కొత్త వీడియోను పోస్ట్ చేసింది. తన సొంతింటి కల త్వరలోనే నిజం కానుందని వెల్లడించింది.
(ఇది చదవండి: నాగ్ ఇచ్చిపడేశాడు.. రైతుబిడ్డ ముఖం మాడిపోయింది!)
వీడియోలో శాంతి స్వరూప్ మాట్లాడుతూ..' సొంతింటి కల అనేది ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఇటీవల అమ్మ సర్జరీ కోసం పాత ఇంటిని అమ్మేశా. చాలా ఏళ్లుగా హైదరాబాద్‌లో అద్దె ఇంట్లోనే ఉంటున్నా. కొందరు నా మంచి కోరేవారు కూడా ఉన్నారు. వారి సహకారంతోనే ఇంటిని నిర్మిస్తున్నా. కూకట్‌పల్లిలోని భూదేవిహిల్స్‌లో ఇల్లు ఉంటుంది. త్వరలోనే పూర్తి కానుంది. ' అంటూ సంతోషం వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment