గొర్లె గౌరీ(ఫైల్)
నులకజోడు(భామిని): అమ్మమ్మను చూసేందుకు ఇంటికి వెళ్లిన గురుకుల విద్యార్థిని పచ్చకామర్ల లక్షణాలతో తీవ్ర జ్వరానికి గురై మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే...నులకజోడుకు చెందిన దళిత విద్యార్థిని గొర్లె గౌరీ జ్వరానికి గురై పాలకొండ ఏరియా ఆసుపత్రిలో చేరి వైద్యసేవలు పొందుతూ మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతురాలి కుటుంబ సభ్యులను భామిని సాంఘిక సంక్షేమ గురుకుల అధ్యాపకులు మల్లేశ్వరరావు, శ్రీహరి శనివారం పరామర్శించారు. గౌరీ ఈ నెల 5వ తేదీనే గురుకులంలో ఏడో తరగతిలో చేరినట్టు గురుకుల సిబ్బంది తెలిపారు. ఈ నెల 15న నులకజోడుకు వెళ్లిన గౌరీ తీవ్ర అస్వస్థతకు గురవడంతో భామిని పీహెచ్‌సీకి తరలించి అక్కడ నుంచి పాలకొండ ఏరియా ఆసుపత్రికి తరలించారని తెలిపారు. మృతురాలి తల్లిదండ్రులు ఆమె చిన్నతనంలోనే మృతి చెందడంతో గౌరీ అమ్మమ్మ తవిటమ్మ వద్ద ఉండేది.