సాక్షి, హైదరాబాద్: ఎడ్‌సెట్ సెట్ -2015 తుది దశ కౌన్సెలింగ్ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. మొదటి దశ కౌన్సెలింగ్‌లో భర్తీ అయిన సీట్లు పోను రాష్ట్రవ్యాప్తంగా అన్ని వ ర్సిటీల పరిధిలోని కళాశాలల్లో దాదాపు 9 వేల సీట్లు ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీకి 13 నుంచి 16 వరకు ఎడ్‌సెట్ ర్యాంకర్ల ధ్రువపత్రాల పరిశీలన చేయనున్నారు.
ఇందుకు హైదరాబాద్ గగన్ మహల్‌లోని ఏవీ కాలేజీ, నిజామాబాద్‌లోని గిరిరాజ్ ప్రభుత్వ కాలేజీ, వరంగల్‌లోని కాకతీయ వర్సిటీ క్యాంపస్‌లో హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 13న సోషల్ సైన్స్, 14న జీవశాస్త్రం, ఇంగ్లిష్, 15న గణితం, భౌతిక శాస్త్రం మెథడాలజీకి సంబంధించి తుది ర్యాంకు వరకు అభ్యర్థులు హెల్ప్‌లైన్ సెంటర్లలో హాజరుకావాలని సోమవారం ఎడ్‌సెట్ కన్వీనర్ పి. ప్రసాద్ సూచించారు.