పోలీసుల అదుపులో 106మంది యువకులు | 106 youngsters in police custody | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో 106మంది యువకులు

Published Sun, May 24 2015 9:09 AM | Last Updated on Tue, Aug 21 2018 7:17 PM

పోలీసుల అదుపులో 106మంది యువకులు - Sakshi

పోలీసుల అదుపులో 106మంది యువకులు

హైదరాబాద్: అర్ధరాత్రి దాటిన తర్వాత రోడ్లపై సంచరిస్తున్న జులాయిల పనిపట్టేందుకు పోలీసులు మరోసారి పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించారు. 110 మందిని అదుపులోకి తీసుకుని వారిని ఫలక్‌నుమాలోని బషేరా ఫంక్షన్ హాల్‌కు తరలించారు. చాంద్రాయణగుట్ట, ఛత్రినాక, ఫలక్‌నుమా, కాంచన్‌బాగ్, మెయిన్‌బజార్ తదితర ప్రాంతాల్లో మొత్తం 17 పోలీస్ స్టేషన్ల పరిధిల్లో శనివారం అర్ధరాత్రి సౌత్‌జోన్ పోలీసుల ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. పట్టుబడిన వారికి వారి తల్లిదండ్రులను పిలిపించి అడిషినల్ డీసీపీ బాబూరావు ఆదివారం ఉదయం బషేరా ఫంక్షన్ హాల్లో కౌన్సెలింగ్ ఇచ్చారు.

శుక్రవారం అర్ధరాత్రి కూడా 300 మందిని అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement