గుడ్డు కోసం గొడవ.. వైరల్‌ వీడియో! | Rowdy Sheeters Attack On A Man In Nizamabad | Sakshi
Sakshi News home page

గుడ్డు కోసం గొడవ.. యువకునిపై సీసాలతో దాడి

Published Tue, Apr 2 2019 11:24 AM | Last Updated on Tue, Apr 2 2019 11:41 AM

Rowdy Sheeters Attack On A Man In Nizamabad - Sakshi

సాక్షి, నిజమాబాద్‌: నగరంలో రౌడీషీటర్లు రెచ్చిపోయారు. తమకు ఎదురుచెప్పిన ఓ యువకునిపై విచక్షణ రహితంగా సీసాలతో దాడికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. నిజమాబాద్‌లోని ఓ సూపర్‌ మార్కెట్‌లో గుడ్డు కొనుగోలు విషయంలో సోమినేని రాజు అనే యువకునితో కొందరు రౌడీషీటర్లకు గొడవ పడ్డారు. సూపర్‌ మార్కెట్‌ వెలుపల అందరు చూస్తుండగానే రాజును సీసాలతో చితకబాదారు. ఈ దాడిలో రాజుకు తీవ్ర రక్తస్రావం కావడంతో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రాజు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రాజుపై జరిగిన దాడికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపడతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement