
సాక్షి, హైదరాబాద్: లంగర్‌హౌస్‌లో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన జంట హత్యల కేసును పోలీసులు ఛేదించారు. ప్రధాన నిందితుడు రౌడీషీటర్ హర్షద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అబూ, చాంద్ మహ్మద్‌ను హర్షద్ గ్యాంగ్ కత్తులతో నరికి హత్య చేసినట్లు నిర్ధారించారు. క్వాలిస్ వాహనంలో ఆరుగురు వచ్చి హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. మరో ముగ్గురు పరారీలో ఉండగా, ముంబై వైపు వెళ్లినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాతకక్షల నేపథ్యంలోనే హత్యలు జరిగినట్టు విచారణలో తేలింది. కొన్నాళ్ల నుంచి ఇబ్రహీం నుంచి తప్పించుకుని ముంబైలో తలదాచుకున్న చాంద్.. లాక్‌డౌన్ నేపథ్యంలో ముంబై నుంచి హైదరాబాద్‌కు వచ్చినట్లుగా తెలిసింది. గచ్చిబౌలి, లంగర్‌హౌస్ తదితర ప్రాంతాల్లో ఉంటున్న చాంద్‌పై ప్రత్యర్ధులు రెక్కీ చేసి ప్లాన్ ప్రకారం దాడి చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment