
హైదరాబాద్: కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ విద్యార్థినిపై ఇటీవల జరిగిన హత్యాచార ఘటనను ఎ.ఎ.పి.ఐ. (అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియా ఆరిజన్) ప్రెసిడెంట్ డాక్టర్ సతీష్ కత్తుల ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచి వేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానన్నారు. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఇలాంటి అమానవీయ ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని, కేసు దర్యాప్తును వేగవంతం చేసి దోషులను శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆసుపత్రుల్లో డాక్టర్లకు తగినంత భద్రతా చర్యలను ఏర్పాటు చేయాలని కోరారు. పిజి మెడికల్ విద్యార్థినిపై క్రూరమైన ఘటనలో బాధిత కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment