పాతబస్తీలో 25 మంది రౌడీ షీటర్లు అరెస్ట్ | 25 rowdy sheeters arrested | Sakshi
Sakshi News home page

పాతబస్తీలో 25 మంది రౌడీ షీటర్లు అరెస్ట్

Published Sun, Jan 25 2015 12:00 PM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM

25 rowdy sheeters arrested

హైదరాబాద్: నగరంలోని పశ్చిమ మండలం పరిధిలోని పాతబస్తీలో శనివారం అర్థరాత్రి నుంచి పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా 25 మంది రౌడీ షీటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని టాస్క్‌ఫోర్స్ కార్యాలయానికి తరలించారు.  అడిషనల్ డీసీపీ లింబారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ఈ తనిఖీలు నిర్వహించారు.

పట్టుబడిన రౌడీ షీటర్లలో కైజర్ ముఠా సభ్యుడు తబ్రేజ్తోపాటు పలువురు రౌడీ షీటర్లు ఉన్నారు. సోమవారం రిపబ్లిక్ డే దినోత్సవం సందర్బంగా పాతబస్తీలోని అణువణువు పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఈ తనిఖీలు ఆదివారం ఉదయం వరకు కొనసాగాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement