హైదరాబాద్: కుల్సుంపురా పోలీస్‌స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాలలో ఉంటున్న ఎనిమిది మంది రౌడీషీటర్లను బుధవారం పోలీసులు బైండోవర్ చేశారు. గతంలో జరిగిన అల్లర్లు, మతకలహాలలో ఈ రౌడీషీటర్ల పాత్ర ఉన్నట్లు నిర్ధారణ కావడంతో ముందు జాగ్రత్త చర్యగా బైండోవర్ చేసినట్టు ఇన్‌స్పెక్టర్ రామ్మోహన్‌రావు తెలిపారు. బైండోవర్ అయిన రౌడీషీటర్లలో మహ్మద్ యూసుఫ్, హత్వల్ ఉమేష్, ఆర్.కే. రవికిరణ్, మనోజ్, కె.ఆనంద్‌సింగ్, డి. ఉమేష్‌సింగ్, రంజిత్‌సింగ్, రాకేష్‌సింగ్ ఉన్నారు.