రౌఢీలు! | political war in warangal city | Sakshi
Sakshi News home page

రౌఢీలు!

Published Mon, Jan 20 2014 3:35 AM | Last Updated on Mon, Sep 17 2018 5:10 PM

political war in warangal city

 2014... నగరంలో అప్పుడే రాజకీయం మొదలైంది. కాదు.. రాజకీయ నేతలే ‘ఇల్లు’ చక్కదిద్దుకునే పని మొదలుపెట్టారు. ఎన్నికలు సమీపించడంతో తమ బలాన్ని... బలగాలను పెంచుకునేందుకు రౌడీమూకలను పోషించే పనిలో నిమగ్నమయ్యారు. ఫలితంగా కొంత కాలంపాటు నిశ్శబ్దంగా ఉన్న వరంగల్ నగరం మళ్లీ గరం గరంగా మారింది. రాజకీయ అండదండలు పుష్కలంగా ఉండడంతో తాజా, మాజీ రౌడీషీటర్లు పంజా విసురుతున్నారు. ప్రధానంగా వరంగల్ ‘తూర్పు’లో వారి హవానే నడుస్తోంది. పోలీసులకు సమాంతరంగా రాజ్యం నడుపుతూ... భూకబ్జాలు, బెదిరింపులు, సెటిల్మెంట్లతో సామాన్యులను
 దోచుకుంటున్నారు.
 
 
 ఇటీవల చోటుచేసుకున్న కొన్ని ఘటనలు
     రంగంపేటలో ఓ రౌడీషీటర్ తన ఇంటి పక్క ఇళ్లను తనకే అమ్మాలని గలాటా చేస్తున్నాడు. తక్కువ ధరకు అమ్మకుంటే అంతు చూస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. చేసేది రౌడీరుుజం అయినప్పటికీ.... తెల్లవారితే ఆ కాలనీలో నాయకులకు అతడు కట్టిన ఫ్లెక్లీలే దర్శనమిస్తుండడంతో స్థానికులు కిమ్మనకుండా ఉంటున్నారు.
 
     కాశిబుగ్గలోని ఓ రౌడీషీటర్, ఎల్‌బీనగర్‌లోని మరో పేరుమోసిన రౌడీషీటర్ స్థానికంగా భూ తగాదాల్లో తలదూర్చి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు.
 
     గిర్మాజిపేటలో ఇటీవల జరిగిన కత్తిపోటు సంఘటనలో రౌడీషీటర్‌పై కేసు లేకుండా ముఖ్య నేత బంధువు ఒకరు తన అధికార బలంతో ఆ కేసును తిరగరాసినట్లు సమాచారం.
 
     గతంలో హన్మకొండలో పనిచేసిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు తను సర్వీసులో ఉండగా వ డ్డేపల్లి ప్రాంతంలో 1978లో 280 గజాల స్థలాన్ని కొనుగోలు చేశాడు. అప్పుడు దాని ధర రూ.9 వేలు. రిటైర్మెంట్ అయిన తర్వాత సదరు ఉపాధ్యాయుడు కొన్నేళ్లుగా హైదరాబాద్‌లోని అతడి కొడుకుల వద్ద ఉంటున్నాడు. తన స్థలం చూసుకోవడానికి కొద్దిరోజుల క్రితం వడ్డేపల్లికి రాగా... అది కబ్జాకు గురైనట్లు గుర్తించాడు.
 
 షాక్‌కు గురైన సదరు పెద్దాయన పోలీసులను ఆశ్రరుుంచాడు. సివిల్ మ్యాటర్ కావడంతో పోలీసులు అంతగా శ్రద్ధ చూపలేదు. ఇంతలో కబ్జారాయుళ్లు సదరు రిటైర్డ్ ఉపాధ్యాయుడితో బేరసారాలకు దిగారు. అన్న వద్దకు వస్తే సెటిల్ చేసుకుందామన్నారు. దీంతో ఇరువర్గాలు అన్న వద్దకు వెళ్లగా... ప్రస్తుతం రూ. 80 లక్షలు ఖరీదు చేసే స్థలాన్ని  చెరి సమానంగా తీసుకోండని తీర్పు చెప్పాడు. చేసేదేమీ లేక తప్పనిసరి పరిస్థితిలో ఆ ఉపాధ్యాయుడు రూ. 40 లక్షలు తీసుకుని వెళ్లిపోయాడు. ఎటువంటి హక్కు లేకున్నా... స్థలాన్ని కబ్జా చేసిన రౌడీలకు రూ.40 లక్షలు వచ్చాయన్న మాట.
 
 వరంగల్ క్రైం, న్యూస్‌లైన్
 నగరంలో రౌడీమూకల ఆగడాలు మళ్లీ మితిమీరుతున్నారుు. అర్బన్ ఎస్పీగా వెంకటేశ్వర్‌రావు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ట్రైసిటీస్‌గా పేరుగాంచిన వరంగల్, హన్మకొండ, కాజీపేటలో తాజా, మాజీ రౌడీషీటర్లపై ఉక్కుపాదం మోపారు. కౌన్సెలింగ్‌లు... నగర బహిష్కరణ హెచ్చరికలతో వారి ఆగడాలకు కొంత మేర కళ్లెం వేయగలిగారు. అరుుతే ఈ ఏడాది మొదటి అర్ధ భాగంలో సాధారణ ఎన్నికలు జరిగే అవకాశముండడంతో రాజకీ య పక్షాలు ఇప్పటినుంచే కసరత్తు మొదలుపెట్టారుు. ఇందులో భాగంగా పోలీసుల హెచ్చరికలతో తోకముడిచి న రౌడీ నాయకులను తెరపైకి తెచ్చి బలాన్ని ప్రదర్శిస్తున్నారు. వారిని వెంటేసుకుని తిరుగుతూ తమ ఆధిపత్యా న్ని చాటుకుంటున్నారు. రాజకీయ అండదండలు పుష్కలంగా ఉండడంతో సదరు రౌడీ మూకలు మరింతగా రెచ్చిపోరుు భూకబ్జాలకు పాల్పడుతున్నారు. దోచుకున్న లక్షలాది రూపాయల్లో తమ గాడ్ ఫాదర్లకు ఎలక్షన్ ఫండ్‌గా ప్రధాన భాగం సమర్పించుకుంటున్నారు. ఒక్క భూ దందాయే కాకుండా... పంచారుుతీలు... సెటిల్మెంట్లతో సాధారణ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి దోచుకుంటున్నారు. హన్మకొండలోని పెద్దమ్మగడ్డ, ములుగురోడ్డు,యూనివర్సిటీ, బాలసముద్రంలోని శ్రీనివాసనగర్,  దర్గా కాజీపేటలో ఎక్కువగా భూ దందాలు మూడు పువ్వులు.. ఆరు కాయలు అన్న చందంగా సాగుతున్నారుు. రెవెన్యూ పరమైన లోపాలతో పోలీసులు కూడా ఏమి చేయలేని పరిస్థితి నెలకొనడంతో వారు ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారింది.
 
 ‘తూర్పు’లో రౌడీషీటర్లదే హవా
 వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రౌడీషీటర్ల హవా కొనసాగుతోంది. ఎన్నికల నేపథ్యంలో రౌడీలను బడా రాజకీయ నేతలు దగ్గరకు తీస్తుండడం... వారిని ఏకంగా పార్టీల్లో చేర్చుకుంటుండడం ఈ నియోజకవర్గంలో కామన్‌గా మారింది. రాజకీయంగా అండదండలు అందిస్తుండడంతో రౌడీషీటర్లు భూ కబ్జాలు, తగాదాల్లో తలదూరుస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. అంతేకాదు... తమ చేతిలో పరిష్కారం కాని సెటిల్మెంట్లను తమ బాస్‌లకు అప్పజెబుతూ వారి సహకారంతో చక్కబెడుతూ తలా కొంత సొమ్ము చేసుకుంటున్నారు.
 
 పోలీస్ అధికారులపై ఒత్తిళ్లు
 రౌడీమూకల ఆగడాలు మితిమీరడంతో..  కౌన్సిలింగ్ ఇచ్చేందుకు మిల్స్‌కాలనీ పోలీసులు ఇటీవల వారిని స్టేషన్‌కు తీసుకొచ్చారు. వారికి కౌన్సిలింగ్ మొదలుపెట్టారో.. లేదో... రాజకీయ నాయకుల నుంచి ఫోన్‌లు వరదలా వచ్చాయి. ‘ఎన్నికల సంవత్సరం... చూసిచూడనట్లుగా ఉండాలి... లేకుంటే ఏంచేయాలో మాకు తెలుసు...’ అం టూ వార్నింగ్‌లు వచ్చినట్లు సమాచారం. అధికార పార్టీ ముఖ్య నేత తమ్ముడు ఫోన్‌లో పోలీస్ అధికారులపై తీవ్రస్థాయిలోఒత్తిడి తీసుకురావడంతో రౌడీలకు కౌన్సిలింగ్ నుంచి విముక్తి కలిగింది. దీన్ని బట్టి పోలీస్ అధికారులపై ఏమేర ఒత్తిళ్లు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్‌రావు, పోలీస్ యంత్రాంగం పెట్రేగిపోతున్న రౌడీ మూకలపై దృష్టి సారించకుంటే... తీవ్ర అనర్థాలు జరిగే అవకాశాలు లేకపోలేదు.
 
 బార్ ఎదుట రౌడీషీటర్ల ఘర్షణ
 వరంగల్ చౌరస్తాలో తాజాగా ఆదివారం ఉదయం నలుగురు రౌడీషీటర్లు వీరంగం సృష్టించారు.  వారి వెంట మరో 15 మంది వరకు ఉన్నట్లు తెలిసింది. నడిరోడ్డుపై ఘర్షణకు దిగిన వారిని అదుపులోకి తీసుకున్న ఇంతేజార్‌గంజ్ పోలీసులు వారిపై రాజకీయ ఒత్తిళ్లతో ఎలాంటి చర్య తీసుకోకుండానే వదిలేశారు. వరంగల్‌లో రౌడీలకు  రాజకీయ నాయకుల ఆశీస్సులు ఏ స్థారుులో ఉన్నాయో ఈ ఘటనే అద్దం పడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement