
సాక్షి,హైదరాబాద్ : నగరంలోని బంజారాహిల్స్ పెన్షన్ ఆఫీస్ సమీపంలో బుధవారం రౌడీషీటర్లు వీరంగం సృష్టించారు. అయిదుగురి వ్యక్తులపై రౌడీ షీటర్లు కత్తులతో దాడి చేశారు. ఈ సంఘటనలో ఒకరు మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.