Bathina Srinivasulu
-
విజయవాడ: కర్ఫ్యూ అమలను పరిశీలించిన సీపీ బత్తిన శ్రీనివాసులు
-
‘అనవసరంగా రోడ్లపైకి వచ్చి మాకు పని కల్పించొద్దు’
సాక్షి,విజయవాడ: కర్ఫ్యూ అమలును సిటీ పోలీస్ విజయవాడ కమిషనర్ బత్తిన శ్రీనివాస్ పరిశీలించారు. గొల్లపూడి, మహానాడు సెంటర్, బెంజి సర్కిల్లో కర్ఫ్యూని సీపీ పర్యవేక్షించారు. పోలీస్ సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. కర్ఫ్యూని మరింత కట్టుదిట్టంగా అమలు చేయాలని ఆదేశించారు. సీపీ మాట్లాడుతూ.. కర్ఫ్యూకి ప్రజలు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు. మరో పదిరోజులు ఇదే సహకారం అందించాలని కోరారు. సరుకులు, కూరగాయలకు మూడు రోజులకొకసారి బయటకు రావాలని సూచించారు. స్వీయ నియంత్రణ పాటించి కరోనా కట్టడికి సహకరించాలని కోరారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చి పోలీసులకు పని కల్పించవద్దన్నారు. మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత మినహాయింపు ఉన్న వారికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు ప్రయాణాలు మానుకోవాలని, ప్రజారోగ్య పరిరక్షణకోసం ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని గౌరవించాలన్నారు. కరోనా వ్యాప్తిని అడ్డుకొనేందుకు కోవిడ్ మార్గదర్శకాలు పాటించాలని సీపీ పేర్కొన్నారు. చదవండి: జిందాల్ యాజమాన్యానికి వైద్యారోగ్యశాఖ కృతజ్ఞతలు -
డ్రగ్స్ ముఠాల భరతం పడతాం
సాక్షి, విజయవాడ: డ్రగ్స్ మాఫియాపై ప్రత్యేక నిఘా పెట్టామని విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు అన్నారు. నగరంలోకి గంజాయి ఎక్కువగా వస్తున్నట్లు గుర్తించామన్నారు. గోవా, కర్ణాటక నుంచి వస్తున్న సింథటిక్ డ్రగ్స్‌పైనా దృష్టి సారించామన్నారు. ఇప్పటికే డ్రగ్స్‌కు సంబంధించి రెండు కేసుల్లో నలుగురు విదేశీయులను అరెస్ట్ చేశామని తెలిపారు. ఒరిస్సా, విశాఖపట్నంల నుంచి విజయవాడ మీదుగా కర్ణాటక, మహారాష్ట్రలకు స్మగ్లింగ్ జరుగుతోందమన్నారు. ఆరు నెలల్లో మూడు కిలోలకు పైగా గంజాయిని పట్టుకుని 50 మందిని అరెస్టు చేశామని వివరించారు. (ఆత్మహత్యకు ముందు యువతి సెల్ఫీ వీడియో ) గురువారం సీపీ బత్తిన శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ.. విదేశీయుల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసిన న్యాయ విద్యార్థి అర్జున్ నుంచి వివరాలు సేకరించామన్నారు. అతను చెప్పిన వివరాల మేరకు డ్రగ్స్ వాడకానికి అలవాటు పడ్డ ఆరుగురిని గుర్తించి కౌన్సెలింగ్ ఇచ్చామని తెలిపారు. వాళ్లందరినీ డీ అడిక్షన్ సెంటర్‌కు తరలించామని పేర్కొన్నారు. యువతను మత్తువైపు మళ్లిస్తున్న డ్రగ్స్ సరఫరా ముఠాల భరతం పడతామని హెచ్చరించారు. మరోవైపు పిల్లల నడవడికను తల్లిదండ్రులు ఎప్పుడూ పర్యవేక్షిస్తుండాలని సూచించారు. నిర్లక్ష్యం చేస్తే పిల్లలు చెడుదారి పట్టి భవిష్యత్తును పాడు చేసుకునే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. (రౌడీ షీటర్‌పై ఆరు నెలల బహిష్కరణ) -
విజయవాడలో రౌడీ షీటర్ నగర బహిష్కరణ
సాక్షి, విజయవాడ: రౌడీ షీటర్ యూసఫ్ పఠాన్‌పై నగర బహిష్కరణ వేటు పడింది. విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు మంగళవారం అతన్ని నగరం నుంచి ఆరునెలల పాటు బహిష్కష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. యూసఫ్ పఠాన్‌పై ఇదివరకే గన్నవరం పోలీస్ స్టేషన్లో రౌడీషీట్ నమోదైంది. అతని నేరప్రవృత్తిలో ఎంతకూ మార్పు రాకపోవడంతో పోలీసులు అతడిపై బహిష్కరణాస్త్రం ప్రయోగించారు. సీపీ బత్తిన శ్రీనివాసులు ఇప్పటికే ఇద్దరు రౌడీ షీటర్లను విజయవాడ నుంచి బహిష్కరించారు. ఈ వరుస బహిష్కరణల పర్వం రౌడీ షీటర్ల గుండెల్లో దడ పుట్టిస్తోంది. (విజయవాడ సీపీగా శ్రీనివాసులు బాధ్యతలు) చదవండి: (విశాఖ గ్యాంగ్‌వార్.. పోలీసులు సీరియస్..) -
బెజవాడ రౌడీషీటర్లకు ఫైనల్ వార్నింగ్..
సాక్షి, విజయవాడ: నేరాల అదుపుతోపాటు, శాంతి భద్రతలపై పోలీసులు సీరియస్‌గా దృష్టి సారించారు. నేరాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. నగర సీపీ బత్తిన శ్రీనివాసులు ఆదేశాల మేరకు నగరంలో రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అజిత్ సింగ్ నగర్, నున్న పోలీస్‌స్టేషన్ పరిధిలో పాత నేరస్తులకు సీఐలు లక్ష్మీనారాయణ, ప్రభాకర్ లు కౌన్సిలింగ్ ఇచ్చి, వారి నుంచి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఎక్కడ నివాసం ఉంటున్నారు. ఏం పని చేసి జీవిస్తున్నారో ఆరా తీశారు. అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 47 మంది రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. (నందిగామలో దారుణం : హత్య చేసి ఆపై..) నగరంలో ఎక్కడైనా పాత నేరస్తులు ఇబ్బంది పెడుతుంటే తమ దృష్టికి తేవాలని సీఐలు విజ్ఞప్తి చేశారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. రౌడీషీటర్లు అందరితో కలసిపోయి మంచిగా జీవనం సాగించాలన్నారు. మంచిగా జీవిస్తున్న వారిని తమ దృష్టికి తీసుకువస్తే అధికారులతో చర్చించి రౌడీషీట్ ఎత్తివేసేలా కృషిచేస్తామని పోలీసులు చెప్పారు. (కలకలం రేపిన వృద్ధురాలి హత్య)