vijayawada police commissioner
-
బెజవాడ రౌడీషీటర్లకు ఫైనల్ వార్నింగ్..
సాక్షి, విజయవాడ: నేరాల అదుపుతోపాటు, శాంతి భద్రతలపై పోలీసులు సీరియస్‌గా దృష్టి సారించారు. నేరాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. నగర సీపీ బత్తిన శ్రీనివాసులు ఆదేశాల మేరకు నగరంలో రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అజిత్ సింగ్ నగర్, నున్న పోలీస్‌స్టేషన్ పరిధిలో పాత నేరస్తులకు సీఐలు లక్ష్మీనారాయణ, ప్రభాకర్ లు కౌన్సిలింగ్ ఇచ్చి, వారి నుంచి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఎక్కడ నివాసం ఉంటున్నారు. ఏం పని చేసి జీవిస్తున్నారో ఆరా తీశారు. అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 47 మంది రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. (నందిగామలో దారుణం : హత్య చేసి ఆపై..) నగరంలో ఎక్కడైనా పాత నేరస్తులు ఇబ్బంది పెడుతుంటే తమ దృష్టికి తేవాలని సీఐలు విజ్ఞప్తి చేశారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. రౌడీషీటర్లు అందరితో కలసిపోయి మంచిగా జీవనం సాగించాలన్నారు. మంచిగా జీవిస్తున్న వారిని తమ దృష్టికి తీసుకువస్తే అధికారులతో చర్చించి రౌడీషీట్ ఎత్తివేసేలా కృషిచేస్తామని పోలీసులు చెప్పారు. (కలకలం రేపిన వృద్ధురాలి హత్య) -
ప్రేమ పేరుతో ఒకడు.. దాని ఆసరాగా మరొకడు..!
సాక్షి, అమరావతి: ఓ యువతిని బెదిరించి లైంగిక దాడికి పాల్పడి.. ఆ తర్వాత తరచూ వేధింపులకు ఒడిగడుతున్న ఓ యువకుడిని విజయవాడ నగర పోలీసులు ఫోక్సో చట్టం కింద అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మూడేళ్లుగా బెదిరింపుల పర్వం కొనసాగుతుండగా యువతి గత శుక్రవారం ఉదయం తల్లిదండ్రులకు చెప్పగా.. వారు విజయవాడ పోలీసు కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. తద్వారా మాచవరం పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేశారు. అదే రోజు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే ఈ విషయాలేమీ తెలియని ఆ యువకుడి తల్లిదండ్రులు సూర్యారావుపేట పోలీసుస్టేషన్లో తమ కుమారుడు కనిపించలేదని ఫిర్యాదు చేయడం గమనార్హం. సేకరించిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. ప్రేమ పేరుతో నయవంచన.. విజయవాడలో మాచవరం ప్రాంతంలో ఉన్న రితేశ్(పేరు మార్చాం)కు ఉమ్మడి స్నేహితుల ద్వారా ఓ పుట్టిన రోజు వేడుకలో ఒక యువతితో 2017లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ యువతి ఆ యువకుడిని నమ్మడంతో.. ఇద్దరూ హద్దులు దాటారు. ఏకాంతంగా ఉన్నప్పుడు వీడియోలు, చిత్రాలు తీసుకున్నారు. తర్వాత రితేశ్ ఉద్యోగరీత్యా ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు. రితేష్ గతంలో తాము తీసుకున్న చిత్రాలను తన స్నేహితుడు భార్గవ్(పేరు మార్చాం)కు ఫోన్లో షేర్ చేసి.. నయ వంచనకు పాల్పడ్డాడు. స్నేహితుడి బెదిరింపులు.. ఆస్ట్రేలియాలో ఉన్న రితేష్ స్నేహితుడు భార్గవ్ కూడా యువతికి ఫ్రెండ్ కావడంతో ఓ రోజు యువతికి భార్గవ్ ఫోన్ చేసి తన దగ్గర ఉన్న ఫొటోల వివరాలు చెప్పాడు. తాను చెప్పినట్లు వినకపోతే మీ అసభ్య చిత్రాలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని బెదిరింపుల పర్వానికి తెరదీశాడు. ఒంటరిగా కలవాలని సూచించాడు. దీంతో చేసేది లేక భార్గవ్ చెప్పినట్లుగానే యువతి ఒంటరిగా కలిసింది. ఆ సమయంలో బెదిరించి యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత తరచూ కలవాలని వేధించ సాగాడు. డబ్బులు డిమాండ్ చేశాడు. అలా రూ. 3 లక్షలు వరకూ యువతి భార్గవ్‌కు ఇచ్చింది. అయినప్పటికీ వేధింపులు కొనసాగడంతో.. తాళలేక చివరకు జరిగిన విషయాన్ని యువతి తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు నగర కమిషనర్ ద్వారకా తిరుమలరావును కలిసి శుక్రవారం ఫిర్యాదు చేశారు. కమిషనర్ ఆదేశాల మేరకు ఆ యువకుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన మా చవరం పోలీసులు సోమవారం భార్గవ్‌ను అరె స్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అలాగే ఆస్ట్రేలి యాలో ఉన్న రితేష్‌పై కూడా కేసు నమోదు చేశారు అరెస్టును అడ్డుకునేందుకు టీడీపీ ఎంపీ విశ్వప్రయత్నం! యువకుడిని మాచవరం పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసి.. రాజధాని ప్రాంతానికి చెందిన ఓ టీడీపీ ఎంపీ పోలీసు ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. ఆ యువకుడిని అరెస్టు చేయకుండా కాపాడేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. పదేపదే నగర కమిషనరేట్‌లో పనిచేస్తున్న పోలీసు అధికారులకు ఫోన్లు చేశారు. తెలంగాణకు చెందిన ఓ మంత్రి ద్వారా కూడా సిఫార్సు చేయించినట్లు సమాచారం. అయితే ఎంపీ చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. -
ఆ రూ.1.92 కోట్లు నావే: మాగంటి బాబు
సాక్షి, అమరావతి బ్యూరో: సార్వత్రిక ఎన్నికల సమయంలో పోలీసులకు పట్టుబడిన రూ.1.92 కోట్లు తనదేనని మాజీ ఎంపీ మాగంటి బాబు క్లెయిమ్ చేసుకున్నారు. అది చేపలు అమ్మగా వచ్చిన ఆదాయమని.. ఆ మొత్తాన్ని రిలీజ్ చేసి తనకు ఇప్పించాలని కోరుతూ విజయవాడ పోలీస్ కమిషనర్‌కు మాగంటి విజ్ఞప్తి చేశారు. వివరాల్లోకి వెళితే.. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా.. ఏప్రిల్ 10వ తేదీన సిమెంట్ లోడు లారీలో తరలిస్తున్న రూ.1,92,90,500 నగదును విజయవాడ పటమట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జగ్గయ్యపేట నుంచి ఏలూరు వెళ్తున్న లారీని కామినేని ఆస్పత్రి సమీపంలో చెక్‌పోస్టు వద్ద తనిఖీ చేశారు. అందులో సిమెంట్ బస్తాల మధ్య రెండు బాక్స్‌లు ఉండటాన్ని గమనించి వాటిని తెరిచి చూడగా.. భారీ నగదు కనిపించింది. ఈ సమయంలో అదే లారీలో ప్రయాణిస్తున్న మాగంటి అనుచరుడు పరారయ్యాడు. డ్రైవర్ కోగంటి సతీష్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా తనకేమీ తెలియదని.. ఆ డబ్బును ఏలూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి కోసం తీసుకెళ్తున్నట్టు తనతోపాటు లారీలో వచి్చన యువకుడు చెప్పాడని డ్రైవర్ వాంగ్మూలం ఇచ్చాడు. ఎలాంటి ఆధారాలు, పత్రాలు లేకుండా తరలిస్తున్న ఆ మొత్తాన్ని అప్పట్లో విజయవాడ నగర పోలీసులు సీజ్ చేసి ఆదాయ పన్ను శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. రెండు రోజుల క్రితం నగర పోలీస్ కమిషనర్‌ను కలిసిన మాగంటి బాబు ఆ సొమ్ము మొత్తం తనదేనని, చేపల్ని విక్రయించగా సమకూరిందని తెలిపారు. ఇందుకు సంబంధించిన లావాదేవీ పత్రాలను ఆదాయ పన్ను శాఖ అధికారులకు చూపగా రూ.64 లక్షల పన్ను విధించారని వివరించారు. పన్ను చెల్లించిన దృష్ట్యా సీజ్ చేసిన డబ్బును తనకు ఇప్పించాలని కోరారు. మాగంటి బాబు చెబుతున్నట్టుగా ఆ డబ్బు సక్రమంగా సంపాదించిందే అయితే రూ.64 లక్షలను ఆదాయ పన్ను, అపరాధ రుసుంగా ఎందుకు చెల్లించాల్సి వచి్చందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చేపల విక్రయం ద్వారానే అంత ఆదాయం వచి్చనా.. పన్నులేవీ చెల్లించకుండా రహస్యంగా ఎందుకు తరలించాల్సి వచి్చందనే ప్రశ్నలూ వినిపిస్తున్నాయి. పోలీసులు కనబడగానే మాగంటి అనుచరుడు పరారవటం కూడా అనుమానాలకు తావిస్తోంది. -
వరద ప్రభావిత ప్రాంతాల్లో సీపీ పర్యటన
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో కృష్ణా జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు శనివారం సుడిగాలి పర్యటన చేశారు. కృష్ణలంక నుంచి తోట్లవల్లూరు వరకు వరద ప్రభావిత ప్రాంతాలను సీపీ స్వయంగా పరిశీలించారు. రెస్క్యూ ఆపరేషన్ ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వరద ప్రభావంతో రోడ్లు జలమయమై సంబంధాలు తెగిపోయిన ప్రాంతాలకు బోటులో వెళ్లి సహాయక చర్యలపై ఆరా తీశారు. వరద పరిస్థితిని లంక గ్రామ వాసులకు వివరించి అందరూ పునరావాసాలకి తరలి రావాలని విజ్ఞప్తి చేసారు. అవసరమైతే అదనపు సిబ్బందిని ఏర్పాటుచేసి ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామన్నారు. పునరావాస కేంద్రాలను సందర్శించి ముంపు బాధితులకు అందుతున్న సదుపాయాలు అడిగి తెలుసుకకున్నారు. -
‘వారిపై ఉక్కుపాదం మోపుతాం’
సాక్షి, విజయవాడ : ఓటర్లు ప్రలోభాలకు గురి కాకుండా ప్రశాంత వాతావరణంలో ఓటు వేయాలని.. అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతామని సీపీ ద్వారక తిరమల రావు హెచ్చరించారు. నేటి సాయంత్రం ఆరుగంటలకు ఎన్నికల ప్రచార గడువు ముగియడంతో.. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మొదటి ఫేజ్‌లో జరుగనున్న ఎన్నికలకు పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిందన్నారు. 1588 పోలింగ్ స్టేషన్లలో 530 పోలింగ్ కేంద్రాల మీద ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. 332 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామన్నారు. 198 మొబైల్ పార్టీలు, 5 స్టేకింగ్ ఫోర్స్, 5 నైట్ ఫోర్స్, పది చెక్‌పోస్ట్‌లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఇప్పటివరకు 2 కోట్ల 43 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. వాటిలో 70 లక్షలు ఆధారాలు చూపిన వారికి తిరిగి ఇవ్వడం జరిగిందన్నారు. మూడు వేల లీటర్ల మద్యాన్ని సీజ్ చేసినట్లు తెలిపారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు సంబంధించి 391 కేసులు నమోదయ్యాయన్నారు. మరికొందరి నుంచి లైసెన్స్డ్ వెపన్లు స్వాధీనం చేసుకున్నామని, ఎన్నికల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 1449 రౌడీషీటర్లను బైండోవర్ చేశామన్నారు. ఆరుకిలోల బంగారం, నాలుగు కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 1231 మంది ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ వాలంటీర్స్ ఎన్నికల విధుల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఓటర్లు మై ఓట్ క్యూ యాప్ ద్వారా వెసులు బాటు చూసుకుని ఓటు వేయవచ్చన్నారు. ఏవైనా ఫిర్యాదులుంటే.. 7328909090కి వాట్సాప్ లేదా 100కి డయల్ చేయవలసిందిగా సూచించారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళిని పాటించాలని కోరారు. ఈ ఎన్నికల్లో బాడీ కెమెరాలు, ఈ బందోబస్తు, యాప్ వంటి టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు తెలిపారు. పెనమలూరు, విజయవాడ సెంట్రల్, మైలవరం, గన్నవరం నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. -
సెలవు రద్దు చేసుకున్న సీపీ గౌతమ్ సవాంగ్
-
సెలవు రద్దు చేసుకున్న సీపీ గౌతమ్ సవాంగ్
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన కాల్ మనీ కేసును వెలుగులోకి తీసుకొచ్చిన విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్.. తన దీర్ఘకాలిక సెలవును రద్దు చేసుకున్నారు. ఆస్ట్రేలియాకు వెళ్లేందుకు 15 రోజులు సెలవు కావాలని దరఖాస్తు చేసుకున్న సవాంగ్, ఆ ఆలోచనను విరమించుకుని బుధవారం విధులకు హాజరయ్యారు. కాల్ మనీ కేసు విచారణను మీరే చేపట్టాలంటూ బాధితులు విన్నవించడంతో సవాంగ్ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్టు సమాచారం. ముక్కుసూటి వ్యక్తిగా పేరున్న సవాంగ్ రాజకీయ ఒత్తిళ్లతో సెలవుపై వెళ్లారని, ఆయన స్థానంలో ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ అధికారి సురేంద్ర బాబుకు బాధ్యతలు అప్పగించినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై గౌతమ్ సవాంగ్ బుధవారం నాడు మీడియాతో మాట్లాడారు. ఆయనేమన్నారంటే.. ''సెలవు రద్దు చేయాలని నేనే అడిగాను. దాంతో డీజీపీ కూడా వెంటనే రద్దు చేశారు. పండగ సమయంలో కుటుంబ సభ్యులంతా ఆస్ట్రేలియాలో కలవాలని అనుకున్నాం. కానీ కేసు తీవ్రత చూసిన తర్వాత, ప్రజలంతా కూడా నన్ను ఉండాలని ఒత్తిడి చేయడంతో సెలవు రద్దుచేసుకున్నాను. ఇందులో రాజకీయం ఏమీ లేదు, ఒత్తిళ్లు కూడా లేవు. చాలా రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే మేం మాత్రం ఈ కేసును వ్యవస్థాగతంగా, లాజికల్‌గా విచారణ చేస్తున్నాం. తొందర పడటం లేదు. ఏరకమైన ఒత్తిడి కూడా లేదు. రాజకీయం కూడా ఏమీ లేదు. దయచేసి అలాంటి మాటలు తీసుకురావద్దు. కేసు ప్రస్తుతం విచారణలో ఉంది. అది పూర్తయ్యేవరకు దీని గురించి మాత్రం ఏమీ చెప్పలేను. ఈ కేసులో మోసం, ఎక్స్టార్షన్, అన్నీ ఉన్నాయి. డాక్యుమెంట్లు తీసుకోవడం, ఖాళీ పత్రాల మీద సంతకాలు తీసుకోవడం తగదు. సీపీ కార్యాలయం గేటు దగ్గరకు చాలా మంది వస్తున్నారు. ఇది పెద్ద సమస్య. దీన్ని తప్పకుండా పరిష్కరిస్తాం. ఇందులో పెద్ద మొత్తాలు ఉన్నాయి కాబట్టి ఆదాయపన్ను శాఖ అధికారులకు కూడా విషయం చెప్పాల్సి ఉంటుంది'' అని సీపీ గౌతమ్ సవాంగ్ చెప్పారు. వాస్తవానికి సీపీ గౌతమ్ సవాంగ్ గత వారం రోజులుగా ఈ కేసును ఛాలెంజింగ్‌గా తీసుకున్నారు. ఎంత పెద్దవాళ్లయినా వదిలిపెట్టేది లేదని ఆయన చెబుతూ వస్తున్నారు. టీడీపీ నాయకుల గుట్టును రట్టు చేశారు. ఇంతలో అకస్మాత్తుగా ఆయన సెలవు విషయం బయటకు వచ్చింది. ఈనెల 27న తాను మళ్లీ విధుల్లో చేరుతానని చెప్పారు. పెద్ద ఎత్తున రాజకీయ ఒత్తిళ్లు వచ్చాయి. కేసును తప్పుదోవ పట్టించేందుకే సవాంగ్‌ను సెలవులో పంపారని ఆరోపణలు వచ్చాయి. వీటిని డీజీపీ జేవీ రాముడు, స్వయంగా గౌతమ్ సవాంగ్ కూడా ఖండించినా, కేసును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నవాళ్లు మాత్రం ఇది బలవంతపు సెలవేనని అనడంతో.. తప్పనిసరి పరిస్థితులలో ఆయన సెలవు రద్దయింది. -
బొండా కుమారుడిపై చర్యలు తప్పవు
విజయవాడ పోలీస్ కమిషనర్ స్పష్టీకరణ విజయవాడ: పుట్టినరోజు వేడుకల పేరిట నిబంధనలు అతిక్రమించిన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు కుమారుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్టు పోలీస్ కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు వెల్లడించారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే ట్రాఫిక్ అధికారులు కొన్ని ఆధారాలు సేకరించారని వివరించారు. మరిన్ని ఆధారాల సేకరణకు ట్రాఫిక్ ఉన్నతాధికారులను ఆదేశించామన్నారు. -
'డామినేషన్' ఎందుకు అర్థం కావడంలేదో?
విజయవాడ: 'ఆపరేషన్ నైట్ డామినేషన్'ను సామాన్య ప్రజలు అర్థం చేసుకున్నారని మేధావులు, జర్నలిస్టులకు ఎందుకు అర్థంకావడం లేదోనని విజయవాడ పోలీసు కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. శ్రీలంకలో ట్రాఫిక్ పై ఉన్న అవగాహన విజయవాడలో లేకపోవడం దురదృష్టకరమన్నారు. మన పాఠశాలల్లో మహాత్మ గాంధీ, ఝాన్సీ లక్ష్మీభాయి గురించి బోధిస్తారని, ట్రాఫిక్ అవగాహన గురించి చెప్పరని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బెజవాడలో అర్థరాత్రి అసాంఘిక శక్తుల ఆట కట్టించేందుకు నైట్ సేఫ్ సిటీలో భాగంగా పోలీస్ కమిషనర్ వెంకటేశ్వరరావు ప్రయోగాత్మకంగా 'ఆపరేషన్ నైట్ డామినేషన్'ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. గుర్తింపు కార్డులు లేకున్నా, పొంతనలేని సమాధానాలు చెప్పినా.. వెంటనే వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తారు. -
'నగలు, డబ్బు ..పాత బట్టల్లో దాచుకోండి'
విజయవాడ : విజయవాడ పోలీస్ కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శనివారం ఓపెన్ హౌస్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ...ప్రజల నిర్లక్ష్యం వల్లే నేరాలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఉన్న పోలీసు సిబ్బందితో నేరాలు నియంత్రించలేమని పోలీస్ కమిషనర్ అన్నారు. అదనపు సిబ్బంది కావాలంటే రూ.100 కోట్లు ఖర్చవుతుందన్నారు. ఆ భారం కూడా ప్రజలపైనే పడుతోందని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా... నగలు, నగదు చోరీ కాకుండా పాత పుస్తకాలు, పాత బట్టల్లో దాచుకోవాలంటూ ఉచిత సలహా ఇవ్వటం విశేషం. -
'ఇంటివద్దకే ఎఫ్ఐఆర్ విధానంతో సత్ఫలితాలు'
ఏలూరు: ఇంటివద్దకే ఎఫ్ఐఆర్ విధానం సత్ఫలితాలు ఇచ్చిందని విజయవాడ పోలీసు కమిషనర్ వెంకటేశ్వరరావు తెలిపారు. పోలీసు స్టేషన్ లోని రిసెప్షన్ కౌంటర్ ను ఆన్లైన్ కు అనుసంధానం చేసి ఫిర్యాదులపై ఎస్ఎంఎస్ ల ద్వారా ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తామన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఆదివారం ఆయన 'సాక్షి' ప్రతినిధితో మాట్లాడారు. రాత్రి నేరాల అదుపుకు ఆపరేషన్ నైట్ డామినేషన్ చేపడుతున్నట్టు చెప్పారు. విజయవాడలో భూకబ్జాలకు పాల్పడితే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. విజయవాడను ప్రశాంతంగా ఉంచడమే పోలీసుశాఖ లక్ష్యమన్నారు. పోలీసులపై పనిభారం తగ్గించడానికి 8 గంటలు మాత్రమే డ్యూటీ వేస్తామని కమిషనర్ తెలిపారు.