'డామినేషన్' ఎందుకు అర్థం కావడంలేదో?
విజయవాడ: 'ఆపరేషన్ నైట్ డామినేషన్'ను సామాన్య ప్రజలు అర్థం చేసుకున్నారని మేధావులు, జర్నలిస్టులకు ఎందుకు అర్థంకావడం లేదోనని విజయవాడ పోలీసు కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. శ్రీలంకలో ట్రాఫిక్ పై ఉన్న అవగాహన విజయవాడలో లేకపోవడం దురదృష్టకరమన్నారు. మన పాఠశాలల్లో మహాత్మ గాంధీ, ఝాన్సీ లక్ష్మీభాయి గురించి బోధిస్తారని, ట్రాఫిక్ అవగాహన గురించి చెప్పరని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
బెజవాడలో అర్థరాత్రి అసాంఘిక శక్తుల ఆట కట్టించేందుకు నైట్ సేఫ్ సిటీలో భాగంగా పోలీస్ కమిషనర్ వెంకటేశ్వరరావు ప్రయోగాత్మకంగా 'ఆపరేషన్ నైట్ డామినేషన్'ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. గుర్తింపు కార్డులు లేకున్నా, పొంతనలేని సమాధానాలు చెప్పినా.. వెంటనే వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తారు.