Operation night domination
-
'డామినేషన్' ఎందుకు అర్థం కావడంలేదో?
విజయవాడ: 'ఆపరేషన్ నైట్ డామినేషన్'ను సామాన్య ప్రజలు అర్థం చేసుకున్నారని మేధావులు, జర్నలిస్టులకు ఎందుకు అర్థంకావడం లేదోనని విజయవాడ పోలీసు కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. శ్రీలంకలో ట్రాఫిక్ పై ఉన్న అవగాహన విజయవాడలో లేకపోవడం దురదృష్టకరమన్నారు. మన పాఠశాలల్లో మహాత్మ గాంధీ, ఝాన్సీ లక్ష్మీభాయి గురించి బోధిస్తారని, ట్రాఫిక్ అవగాహన గురించి చెప్పరని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బెజవాడలో అర్థరాత్రి అసాంఘిక శక్తుల ఆట కట్టించేందుకు నైట్ సేఫ్ సిటీలో భాగంగా పోలీస్ కమిషనర్ వెంకటేశ్వరరావు ప్రయోగాత్మకంగా 'ఆపరేషన్ నైట్ డామినేషన్'ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. గుర్తింపు కార్డులు లేకున్నా, పొంతనలేని సమాధానాలు చెప్పినా.. వెంటనే వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తారు. -
నైట్ ఢాంనేషన్
పోలీస్ చర్యలను తప్పుబట్టిన హైకోర్టు నగరంలో ఆపరేషన్ నైట్ డామినేషన్ రద్దు ప్రభుత్వ మార్గదర్శకాలు తీసుకోవాలని సూచన డీలాపడిన కమిషనరేట్ అధికారులు ఆది నుంచి విమర్శల్లో చిక్కుకున్న ‘ఆపరేషన్ నైట్ డామినేషన్’కు హైకోర్టులో చుక్కెదురైంది. సీపీ వెంకటేశ్వరరావు ప్రతి ష్టాత్మకంగా తీసుకున్న ఈ చర్యలను రద్దుచేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ సోమవారం తీర్పు చెప్పింది. నైట్ డామినేషన్ పేరుతో పోలీసులు తీసుకుంటున్న చర్యలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమంటూ నగరానికి చెందిన న్యాయవాది తానికొండ చిరంజీవి చేసిన వాదనతో హైకోర్టు బెంచ్ ఏకీ భవించి ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. విజయవాడ సిటీ/హైదరాబాద్ : ‘నైట్ సేఫ్ సిటీ’ కార్యక్రమంలో భాగంగా గత నవంబర్ 15న ఆపరేషన్ నైట్ డామినేషన్ కార్యక్రమానికి సీపీ వెంకటేశ్వరరావు శ్రీకారం చుట్టారు. రాత్రి 11 గంటల తర్వాత తగిన గుర్తింపు పత్రాలు లేకుండా రోడ్లపై తిరగడాన్ని నిషేధించారు. పోలీసుల ఆంక్షలను ఖాతరు చేయని వారిని అదుపులోకి తీసుకున్నారు. సూర్యారావుపేట పోలీసు కాంప్లెక్స్‌లో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన శిబిరానికి వీరిని తరలించి విచారణ జరిపారు. రాత్రివేళ పట్టుబడిన వారి వేలిముద్రలు, కంటిపాప ఆధారాలను సేకరించారు. పాత నేరస్తులపై కేసులు నమోదుచేసి జైలుకు పంపిన పోలీసు అధికారులు మిగిలిన వారు నగరం విడిచి వెళ్లాలంటూ ఆదేశాలు జారీ చేశారు. తొలిరోజుల్లోనే నైట్ డామినేషన్‌ను నగరవాసులు వ్యతిరేకించారు. అత్యవసర పనుల మీద, ఆస్పత్రులకు.. ఇలా రకరకాల పనులతో హడావుడిగా వెళ్లే వారు తగిన గుర్తింపు కార్డులు వెంట తీసుకెళ్లక ఇబ్బందులు పడ్డారు. ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని) కూడా నైట్ డామినేషన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరేమనుకున్నా వెనక్కి తగ్గేది లేదంటూ పోలీసులు స్పష్టం చేశారు. రాత్రివేళ నగరంలో తిరగాలంటే గుర్తింపు పత్రాలు తప్పనిసరి అంటూ తేల్చిచెప్పారు. సీనియర్ న్యాయవాది పిటిషన్‌తో.. పోలీసులు చేపట్టిన ఈ నైట్ డామినేషన్ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమంటూ న్యాయవాది తానికొండ చిరంజీవి డిసెంబర్ ఒకటో తేదీన హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్-21లో నిర్ధేశించిన స్వేచ్ఛ, సమానత్వానికి పోలీసుల చర్య విరుద్ధమంటూ పిటిషన్లో పేర్కొన్నారు. రాత్రి 11 గంటల తర్వాత గుర్తింపుకార్డులు లేని వారిని పోలీసుస్టేషన్లకు తరలించడాన్ని తప్పుబట్టారు. రాజ్యాంగంలోని సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా, లేని అధికారాలతో ప్రజల హక్కులను పోలీసులు కాలరాస్తున్నారని చెప్పారు. పిటిషనర్ వాదనను దృష్టిలో పెట్టుకుని డిసెంబర్ 8న హైకోర్టు నైట్ డామినేషన్‌పై స్టే విధించింది. ఆ సమయంలోనే డివిజన్ బెంచ్ పోలీసుల చర్యలను తప్పుబట్టింది. ఇదే సమయంలో ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని పోలీసులు విధులు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. అప్పటి నుంచి ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు సోమవారం నాటి తీర్పులో నైట్ డామినేషన్‌ను రద్దు చేసింది. ఆది నుంచి అనుకూలమే.. ఆపరేషన్ నైట్ డామినేషన్‌ను రద్దుచేస్తూ హైకోర్టు చీఫ్ జస్టిస్ కల్యాణ్‌సేన్ గుప్తా, సంజయ్‌కుమార్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. అధికారం లేని విషయాల్లో పోలీసుల జోక్యం కూడదంటూ నగరానికి చెందిన సీనియర్ న్యాయవాది చిరంజీవి దాఖలు చేసిన ప్రజాప్రయోజనాల వ్యాజ్యంపై ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు ఈ మేరకు ఆదేశించింది. స్టే విధింపు సమయంలోనే న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రాత్రివేళ తిరగాలంటే పాస్‌పోర్టు వెంట ఉంచుకోవాలా? అంటూ అప్పట్లోనే కోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రభుత్వం తగిన మార్గదర్శకాలు నిర్ధేశించి పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలంటూ డివిజన్ బెంచ్ సూచించింది. చెంపపెట్టు : న్యాయవాది చిరంజీవి హైకోర్టు బెంచ్ ఇచ్చిన తీర్పు నగర పోలీసులకు గుణపాఠమని పిల్ దాఖలు చేసిన న్యాయవాది తానికొండ చిరంజీవి వ్యాఖ్యానించారు. హైకోర్టు తీర్పుపై ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ తమకు తాము రాజులమని భావించుకుని వ్యక్తిగత ఎజెండాతో సామాన్య పౌరులను ఇబ్బంది పెట్టడం దారుణమని హైకోర్టు తీర్పుతో వెల్లడైందన్నారు. లేని అధికారాలు సృష్టించుకుని ఎప్పుడూ తమ మాటే చెల్లాలనుకునే అధికారులకు ఈ తీర్పు చెంపపెట్టు అని పేర్కొన్నారు. ఇంకా ఆదేశాలు అందాలి : సీపీ నైట్ డామినేషన్‌పై హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలు అందాల్సి ఉందని సీపీ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన చేస్తూ నగరానికి చెందిన న్యాయవాది వేసిన పిల్‌పై చట్ట ప్రకారం పోలీసులు తమ పనిని తాము చేసుకోవచ్చని ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కొనసాగిస్తూ నైట్ సేఫ్టీ మెజర్స్ విషయంలో అవసరమైన సూచనలు ఇవ్వాలంటూ ప్రభుత్వానికి సూచించినట్టు పేర్కొన్నారు. -
'నైట్ డామినేషన్' వద్దు: హైకోర్టు
హైదరాబాద్: విజయవాడ పోలీసులకు హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. 'ఆపరేషన్ నైట్ డామినేషన్' రద్దు చేయాలంటూ న్యాయస్థానం సోమవారం ఆదేశాలిచ్చింది. ఆపరేషన్ నైట్ డామినేషన్ రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. చిరంజీవి అనే న్యాయవాది ఈ అంశంపై కోర్టులో పిటిషన్ వేశారు. విచారణ చేపట్టిన హైకోర్టు.. ఐడీ కార్డుల పేరుతో జనాన్ని వేధించటం సరికాదని వ్యాఖ్యానించింది. బెజవాడలో అర్థరాత్రి అసాంఘిక శక్తుల ఆట కట్టించేందుకు నైట్ సేఫ్ సిటీలో భాగంగా.. పోలీస్ కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు ప్రయోగాత్మకంగా 'ఆపరేషన్ నైట్ డామినేషన్'ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున నాలుగున్నర గంటల వరకు పోలీసుల తనిఖీలు జరుగుతున్నాయి. నగరంలోని ప్రధాన రహదారులు, చీకటి సందులు, గొందులు సైతం వదలకుండా గస్తీ తిరుగుతూ ప్రతి ఒక్కరినీ.. ఆపి వారికి సంబంధించిన సమాచారంపై ఆరా తీస్తారు. గుర్తింపు కార్డులు లేకున్నా.. పొంతనలేని సమాధానాలు చెప్పినా.. వెంటనే వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తారు. -
కమిషనరేట్‌లో కలకలం
చర్చకు దారితీసిన ‘నైట్ డామినేషన్’పై ఎంపీ వ్యాఖ్యలు కేశినేని మాటల వెనుక ఆంతర్యంపై అధికారుల ఆరా? పార్కింగ్ స్థల వివాదంలో పోలీసులు సహకరించలేదని గుర్రు! మంత్రి ఉమాకు సీపీ ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆగ్రహం! విజయవాడ సిటీ : నగర పోలీసు కమిషనర్ ఎ.బి.వెంకటేశ్వరరావు చేపట్టిన ‘ఆపరేషన్ నైట్ డామినేషన్’పై ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని) చేసిన వ్యాఖ్యలు కమిషనరేట్‌లో కలకలం రేపాయి. గతంలో అధికార పార్టీకి చెందిన ఓ న్యాయవాది ఆపరేషన్ నైట్ డామినేషన్ తనిఖీలపై హైకోర్టు నుంచి స్టే తీసుకొచ్చారు. దీనిపై కౌంటర్ దాఖలు చేసి స్టే వెకేట్ చేయించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్న తరుణంలో.. ఎంపీ కూడా ఇదే అంశంపై వ్యతిరేకంగా మాట్లాడటం చర్చనీ యాంశంగా మారింది. ప్రభుత్వ విధానాల్లో భాగంగా పోలీసులు చేపట్టిన చర్యలపై అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులే వ్యతిరేక వ్యాఖ్యలు చేయడంపై పోలీసు వర్గాల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. ఈ వ్యాఖ్యల వెనుక ఇతర కారణాలు ఉండొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. పోలీసు కమిషనర్ నగరానికి వచ్చిన తర్వాత చర్చించి కేశినేని నాని వ్యాఖ్యలపై స్పందించాలని పలువురు సీనియర్ అధికారులు భావిస్తున్నారు. ‘నైట్ డామినేషన్’పై స్టే ‘రాజధాని సేఫ్ సిటీ’ కార్యక్రమంలో భాగంగా నేరగాళ్ల ఏరివేత కోసం గత నెల 16వ తేదీన పోలీసు కమిషనర్ ఎ.బి.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ‘ఆపరేషన్ నైట్ డామినేషన్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా రాత్రి వేళల్లో తనిఖీలు నిర్వహించి ఏ విధమైన గుర్తింపు పత్రాలు లేని వారి కంటిపాపలు, వేలి ముద్రలు సేకరించారు. పోలీసుల తనిఖీల్లో పలువురు పాత నేరస్తులు దొరికారు. ఈ సమయంలో నగరానికి చెందిన సీనియర్ న్యాయవాది తానికొండ చిరంజీవి దాఖలు చేసిన ప్రజాప్రయోజనాల వ్యాజ్యంపై విచారించిన హైకోర్టు నైట్ డామినేషన్ తనిఖీలపై స్టే విధించింది. ఇదే సమయంలో చట్టానికి లోబడి భద్రతాపరమైన చర్యల్లో భాగంగా పోలీసులు చేసే పనులు కొనసాగించాలని హైకోర్టు స్పష్టంచేసింది. హైకోర్టులో స్టే వెకేట్ చేయించేందుకు పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. ఈ ప్రక్రియ సాగుతుండగానే ఎంపీ కేశినేని నాని కూడా సీపీ చర్యలను తప్పుబడుతూ వ్యాఖ్యానించడంతో కలకలం రేగింది. ఆంతర్యమేంటి? పోలీసు కమిషనర్‌ను ఉద్దేశించి ఎంపీ చేసిన వ్యాఖ్యల వెనుక ఇతర కారణాలు ఉండొచ్చనే అభిప్రాయాన్ని కమిషనరేట్‌లోని పలువురు అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా అధికారులు ఆరా తీస్తున్నారు. తన కార్యాలయం పక్కన పార్కింగ్ స్థలం వివాదం సమయంలో పోలీసులు తనకు అనుకూలంగా వ్యవహరించలేదని ఎంపీ ఆగ్రహంతో ఉన్నట్టు తెలిసింది. స్థలం ఖాళీ చేయకుంటే రెండు వర్గాల మధ్య మరోసారి ఆధిపత్య పోరు జరిగే అవకాశం ఉందంటూ పోలీసులు ఇచ్చిన నివేదిక కారణంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకొని ఖాళీ చేయించినట్టు సమాచారం. మరోవైపు తాను చేసే సిఫార్సులను బుట్టదాఖలు చేస్తున్న సీపీ.. మంత్రి దేవినేని ఉమాకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం కూడా కేశినేని ఆగ్రహానికి మరో కారణమని సమాచారం. -
అభిప్రాయాలు ఓపెన్
కమిషనరేట్‌లో తొలిసారిగా ‘ఓపెన్ హౌస్’ తమ వాణి వినిపించిన నగరవాసులు ప్రజలు సహకరిస్తేనే నేరాలు అదుపుచేయగలమన్న సీపీ విజయవాడ సిటీ : ‘ఆపరేషన్ నైట్ డామినేషన్’ కొనసాగించాలని ఒకరు.. బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు పెరిగాయంటూ మరొకరు.. బార్లో మద్యం తాగి బైక్ వద్దకు రాగానే పోలీసులు కేసులు రాస్తున్నారంటూ ఇంకొకరు. కేసు పెట్టి ఏళ్లు గడుస్తున్నా పోయిన సొత్తు ఇవ్వడం లేదని, పోలీసుస్టేషన్లకు మహిళలు వెళ్లలేని స్థితి నెలకొందని మరికొందరు.. ఇలా ‘ఓపెన్ హౌస్’కు హాజరైన పలువురు తమ అభిప్రాయాలను వెల్లడించారు. నగరంలో నేరాల నియంత్రణలో ప్రజలను భాగస్వాములను చేసేందుకు తొలిసారిగా శనివారం కమిషనరేట్‌లో నగర పోలీసు కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. వివిధ అసోసియేషన్లు, సంఘాలు, పలు పార్టీలకు చెందిన కార్పొరేటర్లు పాల్గొన్న ఓపెన్ హౌస్‌లో వారి నుంచి ఆశించిన హామీలను పోలీసులు రాబట్టలేకపోయారు. తొలుత సీపీ మాట్లాడుతూ అన్ని రకాల పోలీసులు కలిపి ఇక్కడ 2,500మంది వరకు ఉన్నట్టు తెలిపారు. వీరి జీత భత్యాలు, ఇతర అలవెన్సులు కలిపి ఏటా రూ.105 కోట్ల నుంచి రూ.110 కోట్ల వరకు ప్రభుత్వం వెచ్చిస్తుందన్నారు. పోలీసుల సంఖ్య పెంచాలంటే ప్రజల నుంచి పన్నులను పెంచాల్సి ఉంటుం దన్నారు. అందువల్లే ఉన్న సిబ్బందితోనే తాము మెరుగైన సేవలు అందిస్తున్నామన్నారు. పట్టణీకరణలో భాగంగా ఇరుకైన ఇళ్లు, అధిక జనసాంద్రత వల్ల నేరస్తులను గుర్తించడం సాధ్యంకావడంలేదన్నారు. ప్రజలు పక్కవాళ్ల గురించి మనకెందుకులే.. అనే ధోరణి కూడా నేరాల పెరుగుదలకు కారణమని చెప్పారు. కుటుంబ సభ్యులు ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు విలువైన వస్తువులు అందుబాటులో లేకుండా చూస్తే మంచిదన్నారు. మహిళలు రోడ్లపై వెళ్లే సమయంలో మోటారుసైకిళ్లపై రాకపోకలు సాగించేవారిని గమనిస్తూ ఉండాలని చెప్పారు. బ్యాంకులు, ఏటీఎంల వద్ద దృష్టి మరల్చేవారి పట్ల అప్రమత్తంగా ఉంటే 50శాతం నేరాలను నిలువరించేందుకు వీలుంటుందని పేర్కొన్నారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటే పోలీసులపై 30 శాతం భారం తగ్గుతుందన్నారు. అనంతరం పలువురు మాట్లాడుతూ నేరాలు జరిగే విధానాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డాక్యుమెంటరీలు, షార్ట్ ఫిల్మ్‌లు తీసి పాఠశాలలు, కాలేజీలు, రైల్వే, బస్టాండ్లలో ప్రదర్శించాలని సూచించారు. మహిళలు పోలీసుస్టేషన్‌కి వెళ్లాలంటే భయపడే పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. డీసీపీలు తఫ్సీర్ ఇక్బాల్, జీవీజీ అశోక్‌కుమార్, అదనపు డీసీపీ జి.రామకోటేశ్వరరావు, ఏసీపీలు గుణ్ణం రామకృష్ణ, వీఎస్ఎన్ వర్మ, పి.సుందరరాజు, లావణ్యలక్ష్మి, రాఘవరావు, టీఎస్ఆర్కే ప్రసాద్ పాల్గొన్నారు. -
బెజవాడ పోలీసులకు హైకోర్టులో ఎదురు దెబ్బ
హైదరాబాద్ : విజయవాడ పోలీసులకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 'ఆపరేషన్ నైట్ డామినేషన్' పై న్యాయస్థానం సోమవారం స్టే విధించింది. ఆపరేషన్ నైట్ డామినేషన్ రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. చిరంజీవి అనే న్యాయవాది ఈ అంశంపై కోర్టులో పిటిషన్ వేశారు. విచారణ చేపట్టిన హైకోర్టు...ఐడీ కార్డుల పేరుతో జనాన్ని వేధించటం సరికాదని వ్యాఖ్యానించింది. బెజవాడలో అర్థరాత్రి అసాంఘిక శక్తుల ఆట కట్టించేందుకు నైట్ సేఫ్ సిటీలో భాగంగా.. పోలీస్ కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు ప్రయోగాత్మకంగా 'ఆపరేషన్ నైట్ డామినేషన్'ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున నాలుగున్నర గంటల వరకు పోలీసుల తనిఖీలు జరుగుతున్నారు. నగరంలోని ప్రధాన రహదారులు, చీకటి సందులు, గొందులు సైతం వదలకుండా గస్తీ తిరుగుతూ ప్రతి ఒక్కరినీ.. ఆపి వారికి సంబంధించిన సమాచారంపై ఆరా తీస్తారు. పేరు.. ఊరు.. ఏం చేస్తారు.. రాత్రి వేళ ఏ పనిమీద వెళ్తున్నారు వంటి ప్రశ్నలకు సంతృప్తికర సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. దీనికితోడు ముఖ్యంగా సదరు పౌరునికి సంబంధించి ఆధార్‌కార్డు లేదా ప్రభుత్వం నుంచి జారీ చేయబడిన మరేదైనా గుర్తింపుకార్డు తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది. గుర్తింపు కార్డులు లేకున్నా.. పొంతనలేని సమాధానాలు చెప్పినా.. వెంటనే వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తుల నుంచి వేలిముద్రలు, ఇతర ఆధారాలు సేకరిస్తారు. ఒకవేళ పట్టుబడిన వారు నేరస్థులైతే.. పోలీసులు తమదైన శైలిలో విచారణ కొనసాగిస్తారు. దీనిపై న్యాయమూర్తి...హైకోర్టును ఆశ్రయించటంతో ఆపరేషన్ నైట్ డామినేషన్‌ను తాత్కాలికంగా బ్రేక్ వేసింది.