'ఇంటివద్దకే ఎఫ్ఐఆర్ విధానంతో సత్ఫలితాలు'
ఏలూరు: ఇంటివద్దకే ఎఫ్ఐఆర్ విధానం సత్ఫలితాలు ఇచ్చిందని విజయవాడ పోలీసు కమిషనర్ వెంకటేశ్వరరావు తెలిపారు. పోలీసు స్టేషన్ లోని రిసెప్షన్ కౌంటర్ ను ఆన్లైన్ కు అనుసంధానం చేసి ఫిర్యాదులపై ఎస్ఎంఎస్ ల ద్వారా ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తామన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఆదివారం ఆయన 'సాక్షి' ప్రతినిధితో మాట్లాడారు.
రాత్రి నేరాల అదుపుకు ఆపరేషన్ నైట్ డామినేషన్ చేపడుతున్నట్టు చెప్పారు. విజయవాడలో భూకబ్జాలకు పాల్పడితే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. విజయవాడను ప్రశాంతంగా ఉంచడమే పోలీసుశాఖ లక్ష్యమన్నారు. పోలీసులపై పనిభారం తగ్గించడానికి 8 గంటలు మాత్రమే డ్యూటీ వేస్తామని కమిషనర్ తెలిపారు.