ఆస్తి కోసం బాబాయ్‌ హత్య | comited to murder for property | Sakshi
Sakshi News home page

ఆస్తి కోసం బాబాయ్‌ హత్య

Published Wed, Aug 10 2016 12:10 AM | Last Updated on Thu, Oct 4 2018 5:44 PM

comited to murder for property

సానిగూడెం(దెందులూరు): ఆస్తికోసం సొంత బాబాయిని రోకలిబండతో కొట్టి చంపాడు ఓ ప్రబుద్ధుడు. ఈ ఘటన దెందులూరు మండలం సానిగూడెంలో జరిగింది. ఏలూరు టౌన్‌ సీఐ రాజశేఖర్‌ కథనం ప్రకారం.. సానిగూడెం గ్రామంలో పంపన రామకృష్ణ(50)కి అతని అన్న కొడుకు రవికి మధ్య కొంతకాలంగా ఆస్తి వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో రవి రోకలి బండతో పంపన రామకృష్ట తలపై మోదాడు.

దీంతో అతను అక్కడికక్కడే మరణించాడు. మృతునికి భార్య, కుమార్తె ఉన్నారు. సమాచారం అందుకున్న సీఐ రాజశేఖర్‌ ఘటనాస్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement