డీటీవో కార్యాలయం వద్ద యూటీఎఫ్ ధర్నా
డీటీవో కార్యాలయం వద్ద యూటీఎఫ్ ధర్నా
Published Sat, Apr 1 2017 12:24 AM | Last Updated on Thu, Oct 4 2018 4:39 PM
ఏలూరు సిటీ : ఎయిడెడ్ ఉపాధ్యాయుల జీతాలు చెల్లించేందుకు బడ్జెట్ విడుదల చేసి ఫ్రీజింగ్ నిబంధనలు తొలగించకపోవటంతో రాష్ట్రంలోని ఎయిడెడ్ ఉపాధ్యాయులు జీతాల, డీఏ బకాయిలు అందక తీవ్రఇబ్బందులు పడుతున్నారని యూటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పీవీ నరసింహారావు తెలిపారు. యూటీఎఫ్ రాష్ట్ర నాయకత్వం రాష్ట్ర ఆర్థికశాఖకు, అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోవటంతో రాష్ట్రవ్యాప్తంగా జిల్లా ట్రెజరీ కార్యాలయాలు, ఎస్టీవో కార్యాలయాల వద్ద మెరుపు ధర్నాకు పిలుపునిచి్చంది. ఇందులో భాగంగా శుక్రవారం ఏలూరు డీటీవో కార్యాలయం వద్ద యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఎయిడెడ్ ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఫ్రీజింగ్‌ను ఎత్తివేసి ఎయిడెడ్ ఉపాధ్యాయులకు జీతాలు, డీఏ బకాయిలు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఆర్.రవికుమార్, ఏలూరు రూరల్ ప్రధాన కార్యదర్శి ఎన్ .రాంబాబు, ఎయిడెడ్ ఉపాధ్యాయ నాయకులు జీఎస్‌ఆర్‌సీ మూర్తి, సీఆర్‌ఆర్ కళాశాల ఆప్టా నాయకులు పీఎన్‌వీ ప్రసాదరావు, కె.శ్రీకాంత్ పాల్గొన్నారు.
Advertisement