ఉగాది కానుకగా ఫైబర్‌నెట్ కనెక్షన్లు
ఉగాది కానుకగా ఫైబర్‌నెట్ కనెక్షన్లు
Published Sat, Mar 11 2017 12:37 AM | Last Updated on Mon, Feb 17 2020 5:11 PM
ఏలూరు (ఆర్‌ఆర్ పేట) : జిల్లా ప్రజలకు ఉగాది కానుకగా రూ.149కే కేబుల్ కనెక్షన్ తో పాటు ఇంటర్నెట్, టెలిఫోన్ సౌకర్యాన్ని కల్పిస్తున్నామని ప్రజలు పెద్ద ఎత్తున ముందుకు వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కాటంనేని భాస్కర్ కోరారు. ఫైబర్ గ్రిడ్ ద్వారా ఇంటింటా కేబుల్ కనెక్షన్ అమలు తీరును ఆయన శుక్రవారం అధికారులు, కేబుల్ నెట్‌వర్క్ ప్రతినిధులతో చర్చించారు. జిల్లాలో ప్రస్తుతం రూ.160 నుంచి రూ.275 వరకూ కేబుల్ కనెక్షన్ కు వసూలు చేస్తున్నారని, ఇకపై ఫైబర్ గ్రిడ్ ద్వారా నాణ్యమైన అన్ని ఛానల్స్‌నూ ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చి ఇంటర్నెట్ సౌకర్యాన్ని కూడా కల్పిస్తామని, ఉచితంగా టెలిఫోన్ సౌకర్యం కూడా దీని ద్వారా కలుగుతుందన్నారు. ఏలూరు కార్పొరేషన్ తో పాటు 8 మున్సిపల్ పట్టణాల్లో స్టాకును అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు. సమావేశంలో జేసీ పి.కోటేశ్వరరావు, ఫైబర్‌నెట్ ప్రతినిధి హరికృష్ణ, ఎంఎస్‌వోలు, ఏసీటీ ప్రతినిధి రామకృష్ణ, భీమవరం ఎంఎస్‌వో పైడిరాజు, జిల్లా అధికారులు డీపీవో కె.సుధాకర్, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ శంకరరావు, డీఎంహెచ్‌వో డాక్టర్ కె.కోటేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
Advertisement