నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు, ఇన్‌సెట్‌లో వారి నుంచి స్వాధీనం చేసుకున్న బంగారు అభరణాలు
సాక్షి, విజయవాడ : కరుడుగట్టిన సత్పాల్ సింగ్ ముఠాకు చెందిన ఇద్దరు సభ్యులను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో హర్యానాకి చెందిన ప్రీత్‌పాల్ టాక్రాన్, రాజస్తాన్‌కి చెందిన రాజీవ్ సోనీలు ఉన్నారు. నిందితుల నుంచి మూడు కిలోల బంగారు అభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరిని పోలీసులు ఆదివారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. అలాగే వీరి నుంచి స్వాధీనం చేసుకున్న అభరణాలను కూడా ప్రదర్శించారు.
పోలీసు అధికారులు మాట్లాడుతూ.. వీరిపై ఆంధ్రప్రదేశ్‌లో 16 కేసులు ఉన్నాయన్నారు. సీసీ కెమెరాలు లేని అపార్ట్‌మెంట్లను, తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వీరు చోరీలకు పాల్పడుతున్నారని తెలిపారు. ముఠా ప్రధాన సూత్రధారి సత్పాల్ సింగ్‌తో పాటు మరో పది మంది సభ్యులు పరారీలో ఉన్నట్టు వెల్లడించారు.. ముఠా నాయకుడు సత్పాల్‌పై హత్యాయత్నాలు, దోపిడీలకు సంబంధించి 30కు పైగా కేసులు ఉన్నట్టు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment