Satpal singh
-
ప్రమోషన్ వచ్చేలోపే ఒకరు.. 31 ఏళ్ల తర్వాత రాఖీ కట్టించుకుని మరొకరు
న్యూఢిల్లీ: జనరల్ బిపిన్ రావత్‌కు సహాయక సిబ్బందిగా ఏడాదికాలంగా విధుల్లో ఉన్న సెకండ్ జనరేషన్ ఆర్మీ అధికారి, బ్రిగేడియర్ లఖ్వీందర్ సింగ్ లిడ్డర్ పదోన్నతి అర్ధంతరంగా ఆగింది. బుధవారం హెలికాప్టర్లో రావత్‌తో పాటు ప్రయాణిస్తూ ప్రాణాలు కోల్పోయిన వారిలో లఖ్వీందర్ ఉన్నారు. హరియాణాలోని పంచకులకు చెందిన లఖ్వీందర్ గతంలో కశ్మీర్లో ఉగ్రవ్యతిరేక ఆపరేషన్లలో, చైనాతో సరిహద్దు వెంట ఆర్మీ బ్రిగేడ్‌కు నేతృత్వం వహించారు. కజక్‌స్తాన్‌లో భారత సైనిక బృందంలో పనిచేశారు. సేనా మెడల్, విశిష్ట్ సేవా మెడల్ ఆయనను వరించాయి. త్రివిధ దళాల విధుల్లో విశేష అనుభవముంది. దాంతో రావత్‌కు సహాయక సిబ్బందిలో డిఫెన్స్ అసిస్టెంట్‌గా నియమితులయ్యారు. సెకండ్ జనరేషన్ ఆర్మీ ఆఫీసర్‌గా ఉన్న ఆయనకు త్వరలోనే మేజర్ జనరల్ పదవిని కట్టబెట్టనున్నారు. ప్రమోషన్ జాబితాలో ఉన్న ఆయన ఆ పదోన్నతి పొందకుండానే వీరమరణం పొందారు. లఖ్వీందర్‌కు భార్య, ఒక కుమార్తె ఉన్నారు. (చదవండి: బెంగళూరు ఆస్పత్రికి వరుణ్ తరలింపు.. 48 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేం) విహార యాత్రకు తీసుకెళ్తామన్నారు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన హవాల్దార్ సత్పాల్ రాయ్ సొంతూరు పశ్చిమబెంగాల్లోని డార్జిలింగ్ జిల్లా తక్దాలో విషాదం అలుముకుంది. రాయ్‌కు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. కుమారుడు సైన్యంలో పనిచేస్తున్నారు. ‘చివరిసారిగా దీపావళికి వచ్చారు. ఏప్రిల్‌లో వస్తానని మాట ఇచ్చారు. అందర్నీ విహారయాత్రకు తీసుకెళ్తానన్నారు. ఇంతలో ఘోరం జరిగింది’ అని రాయ్ భార్య కన్నీటిపర్యంతమయ్యారు. మరోవైపు, ప్రమాదంలో మరణించిన కో–పైలట్, స్క్వాడ్రన్ లీడర్ కుల్దీప్ సింగ్ అంత్యక్రియల ఏర్పాట్లు రాజస్తాన్‌లోని సొంతూరు ఘర్దానా ఖుర్ద్‌లో మొదలయ్యాయి. కాగా, లెఫ్టినెంట్ కల్నల్ హర్జిందర్ అంత్యక్రియలు ఢిల్లీలో జరగనున్నాయి. (చదవండి: సాయి తేజ చివరి మాటలు: ‘‘పాప దర్శిని ఏం చేస్తోంది.. బాబు స్కూల్‌కు వెళ్లాడా’’) 31 ఏళ్ల తర్వాత రాఖీ కట్టారు ఒక సోదరి ముంబైలో ఉండటంతో ఇన్నాళ్లూ కుదరక, ఎట్టకేలకు ముగ్గురు అక్కలతో కలసి 31 ఏళ్ల తర్వాత ఇటీవల రాఖీ పండుగ జరుపుకున్న తన కుమారుడు ఇప్పుడు లేడని, హెలికాప్టర్ ప్రమాదంలో అమరుడైన వింగ్ కమాండర్ పృథ్వీ సింగ్ చౌహాన్ తండ్రి వాపోయారు. ఐదుగురు సంతానంలో ఇతనే చిన్నవాడని పృథ్వీ జ్ఞాపకాలను ఆయన గుర్తుచేసుకున్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన పృథ్వీ కుటుంబం ప్రస్తుతం ఆగ్రాలో నివసిస్తోంది. పృథ్వీ 2000లో హైదరాబాద్‌లో భారత వాయుసేనలో చేరారు. -
సుశీల్‌కు బిగుసుకుంటున్న ఉచ్చు
న్యూఢిల్లీ: యువ రెజ్లర్ సాగర్ రాణా మృతి వ్యవహారంపై పోలీసుల విచారణ కీలక మలుపు తీసుకుంది. గ్రీకో రోమన్ 97 కేజీల విభాగంలో జాతీయ జూనియర్ మాజీ చాంపియన్ అయిన 23 ఏళ్ల సాగర్ రాణాను కొందరు వ్యక్తులు విచక్షణారహితంగా కొట్టడంతో అతను చనిపోయాడు. భారత రెజ్లర్లకు అడ్డాలాంటి ఛత్రశాల్ స్టేడియం బయట జరిగిన ఈ ఘటనలో రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత, భారత మేటి రెజ్లర్ సుశీల్ కుమార్ హస్తం ఉందని వినిపిస్తోంది. అయితే అతను ఇప్పటికీ పోలీసులకు చిక్కలేదు. ఈ నేపథ్యంలో సుశీల్ మామ, సీనియర్ కోచ్ సత్పాల్ సింగ్‌ను పోలీసులు విచారించారు. ‘సుశీల్ మామ సత్పాల్ సింగ్, అతని బావమరిదిలను సుమారు రెండు గంటల పాటు విచారించాం. మంగళవారం స్టేడియం పార్కింగ్ ఏరియా వద్ద జరిగిన గొడవలో సుశీల్, అజయ్, ప్రిన్స్ దలాల్, సోనూ మహల్, సాగర్ అమిత్ భాగంగా ఉన్నారని మా విచారణలో తేలింది. సుశీల్, అతని సహచరులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో వెతుకుతున్నాం’ అని అడిషనల్ డీసీపీ గురిక్బాల్ సింగ్ వెల్లడించారు. మరోవైపు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ జితేంద్ర సింగ్ రాసిన ఎఫ్ఐఆర్ కాపీలో ‘సుశీల్ పహిల్వాన్, అతని సహచరులు ఈ నేరం చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది’ అని రాసి ఉంది. 1982 ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన సత్పాల్ సింగ్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి అర్జున అవార్డు, ద్రోణాచార్య అవార్డు, పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలు కూడా లభించాయి. కెరీర్ తొలినాళ్ల నుంచి సత్పాల్ సింగ్ వద్ద శిక్షణ తీసుకున్న సుశీల్ 2010లో సత్పాల్ సింగ్ కూతురు సావీని పెళ్లి చేసుకున్నాడు. -
కరుడుగట్టిన సత్పాల్ ముఠా సభ్యుల అరెస్ట్
సాక్షి, విజయవాడ : కరుడుగట్టిన సత్పాల్ సింగ్ ముఠాకు చెందిన ఇద్దరు సభ్యులను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో హర్యానాకి చెందిన ప్రీత్‌పాల్ టాక్రాన్, రాజస్తాన్‌కి చెందిన రాజీవ్ సోనీలు ఉన్నారు. నిందితుల నుంచి మూడు కిలోల బంగారు అభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరిని పోలీసులు ఆదివారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. అలాగే వీరి నుంచి స్వాధీనం చేసుకున్న అభరణాలను కూడా ప్రదర్శించారు. పోలీసు అధికారులు మాట్లాడుతూ.. వీరిపై ఆంధ్రప్రదేశ్‌లో 16 కేసులు ఉన్నాయన్నారు. సీసీ కెమెరాలు లేని అపార్ట్మెంట్లను, తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వీరు చోరీలకు పాల్పడుతున్నారని తెలిపారు. ముఠా ప్రధాన సూత్రధారి సత్పాల్ సింగ్‌తో పాటు మరో పది మంది సభ్యులు పరారీలో ఉన్నట్టు వెల్లడించారు.. ముఠా నాయకుడు సత్పాల్పై హత్యాయత్నాలు, దోపిడీలకు సంబంధించి 30కు పైగా కేసులు ఉన్నట్టు పేర్కొన్నారు. -
హనీకి షెల్టర్ ఇచ్చి అరెస్టు.. నో ఆన్సర్స్
పంచకుల: డేరా సచ్చా సౌదాకు సంబంధించిన కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం ఓ మందులషాపు యజమానిని అరెస్టు చేసింది. గత నెల 25న జరిగిన హింసాత్మక ఘటన సమయంలో అతడు గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ దత్తపుత్రిక హనీప్రీత్ ఇన్సాన్కు ఆశ్రయాన్ని ఇవ్వడమే కాకుండా ఆమెకు కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటుచేశాడని, ఆమె అవసరానికి తగిన వస్తువులు చేరవేశాడనే ఆరోపణల కింద అరెస్టు చేశారు. ఈ విషయాన్ని పోలీసులు కూడా ధ్రువీకరించారు. పంచకులలోని సెక్టార్ 20లో మందుల దుకాణం నడుపుతున్న సత్పాల్ సింగ్ అనే వ్యక్తిని తాము అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అతడిని విచారిస్తున్నామని, ఆగస్టు 25కు ముందు ఆ తర్వాత అతడి కదలికలు ఏ విధంగా ఉన్నాయనే విషయాలు తెలుసుకోవడమే కాకుండా, తమకు అంతకుముందే అతడి గురించి అందిన సమాచారంతో ఆ వివరాలను పోల్చి చూస్తున్నట్లు తెలిపారు. అయితే, వీలయినంత మేరకు పోలీసులకు సహకరించకూడదనే దోరిణితో అతడు వ్యవహరిస్తున్నాడని, సమాచారం చెప్పేందుకు నిరాకరిస్తున్నాడని ఈ కేసును ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్న పంచకుల కమిషనర్ తెలిపారు.