హనీకి షెల్టర్‌ ఇచ్చి అరెస్టు.. నో ఆన్సర్స్‌ | Panchkula chemist picked up for giving shelter to Honeypreet | Sakshi
Sakshi News home page

'గుర్మీత్‌' కేసులో మరో అరెస్టు.. నో ఆన్సర్స్‌

Published Mon, Sep 4 2017 2:40 PM | Last Updated on Sun, Sep 17 2017 6:23 PM

హనీకి షెల్టర్‌ ఇచ్చి అరెస్టు.. నో ఆన్సర్స్‌

హనీకి షెల్టర్‌ ఇచ్చి అరెస్టు.. నో ఆన్సర్స్‌

పంచకుల: డేరా సచ్చా సౌదాకు సంబంధించిన కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం ఓ మందులషాపు యజమానిని అరెస్టు చేసింది. గత నెల 25న జరిగిన హింసాత్మక ఘటన సమయంలో అతడు గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ దత్తపుత్రిక హనీప్రీత్‌ ఇన్సాన్‌కు ఆశ్రయాన్ని ఇవ్వడమే కాకుండా ఆమెకు కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటుచేశాడని, ఆమె అవసరానికి తగిన వస్తువులు చేరవేశాడనే ఆరోపణల కింద అరెస్టు చేశారు. ఈ విషయాన్ని పోలీసులు కూడా ధ్రువీకరించారు. పంచకులలోని సెక్టార్‌ 20లో మందుల దుకాణం నడుపుతున్న సత్పాల్‌ సింగ్‌ అనే వ్యక్తిని తాము అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ప్రస్తుతం అతడిని విచారిస్తున్నామని, ఆగస్టు 25కు ముందు ఆ తర్వాత అతడి కదలికలు ఏ విధంగా ఉన్నాయనే విషయాలు తెలుసుకోవడమే కాకుండా, తమకు అంతకుముందే అతడి గురించి అందిన సమాచారంతో ఆ వివరాలను పోల్చి చూస్తున్నట్లు తెలిపారు. అయితే, వీలయినంత మేరకు పోలీసులకు సహకరించకూడదనే దోరిణితో అతడు వ్యవహరిస్తున్నాడని, సమాచారం చెప్పేందుకు నిరాకరిస్తున్నాడని ఈ కేసును ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్న పంచకుల కమిషనర్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement