సాక్షి, విజయవాడ : నగర పోలీస్ కమిషన్ రేట్ పరిధిలో వరస చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా పట్టుబడింది. ముఠా నాయకుడు భూక్యా నాయక్‌ను, అతని గ్యాంగ్‌ను అరెస్టు చేసి పోలీసులు శుక్రవారం మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో దొంగతనాలకు పాల్పడి సవాల్ విసురుతున్న భుక్యా నాయక్ ముఠాను ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయటం ద్వారా క్రైం బ్రాంచ్ పోలీసులు పట్టుకోగలిగారని విజయవాడ సీపీ ద్వారాకా తిరుమలరావు చెప్పారు.
వందల ఇళ్లలో దొంగతనాలకు పాల్పడిన భుక్యా నాయక్ ముఠా నుంచి 54లక్షలు విలు చేసే 1258 గ్రాముల బంగారు ఆభరణాలు, 17.2 కేజీల వెండి ఆభరణాలు, 9లక్షల 65వేల నగదు, ఒక ల్యాప్ ట్యాప్, రెండు కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భూక్యనాయక్ తోపాటు పుల్లేటికుర్తి ఉమామహేశ్వరరావు, బాణావత్ రాజా, నల్లమోతు సురేష్, గుత్తికొండ పవన్ కూమార్ మరో మైనర్.. గ్యాంగ్‌గా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్నారని సీపీ చెప్పారు. ఈ గ్యాంగ్‌పై రాష్ట్రవ్యాప్తంగా 200 కేసులున్నాయని తెలిపారు. ముఠాలోని ఇద్దరు సభ్యులు సురేష్, పవన్ కూమార్ ఇప్పటికే జైళ్లలో ఉన్నారని వెల్లడించారు. ఇంజనీరింగ్ చదివిన ఓ వ్యక్తి కూడా ఈ గ్యాంగ్‌లో సభ్యుడిగా ఉన్నారని సీపీ పేర్కొన్నారు. భుక్యా నాయక్ ముఠా అరెస్టుతో అనేక దొంగతనాలు బయటపడ్డాయని అన్నారు.
సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
విజయవాడలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
Comments
Please login to add a commentAdd a comment